234 తెలుగు భాషా చరిత్ర
7.32. ఆగమచకరానికి 'ముత్తు' పరమైనప్పుడు వకారా దేశమవుతుందని బాలవ్యాకరణ సూత్రం. దీనికి వ్యత్యస్తమైన ప్రయోగాలు కవిత్రయేతర గ్రంథాల్లో కానవస్తున్నాయి. శాసనభాషలో వీనికుదాహరణాలు ఎక్కువగా ఉన్నాయి. పకారాదేశం రాదగిన సందర్భాల్లో రాకపోవటమేకాదు. పూర్వకవుల కావ్యాల్లో కనబడని చోట్ల అర్వాచీనకవుల కావ్యాల్లోరావడం వైయాకరణులు గుర్తించారు. ఉదా : శత్రర్థపరత “చు” వర్ణానికి: మోవి మోవిఁజేరుపుచు (ప్రౌ.వ్యా.క్రియ). ఆశీరర్థకాలైన ఎడున్, తన్ ప్రత్యయాల్లోని ద్రుతం అచ్చుపరమైతే మకారం అవుతుంది : నీకు మేలు కలిగెడు మనియె, కావుతమనియె. సంధిలో కనబడు ఈ మకారం నిజానికి చారిత్రక చిహ్నమే. ఆంధ్రశబ్ద చింతామణిలో ఈ ప్రత్యయం 'డుమ' అని చెప్పబడింది. ఉదా : శుభము ఘటియింపుడు. భారత ప్రయోగాలిలాంటివి కన్పడుతున్నాయి. వివేకమెడలి యుండెడును కప్పలు (భార. అను. 3-143); విష్ణుడు ఇష్టదాయి. ప్రసన్నుఁడయ్యెడుమనాకు (శాంతి. 1.41). _డుమ అశీరర్ధకాలు తర్వాత కవుల్లోలేవు.
7.33. మూల ద్రావిడ భాషనుంచి తెలుగునకు వచ్చిన సంపూర్ణ క్రియలు రెండు : భూతం, తద్ధర్మం. ఇవి తత్రదర్ధ బోధక ప్రత్యయాలలో కూడినవి. తెలుగున చారిత్రక యుగంలో ఏర్పడినవి. భూత, తద్ధర్మ, వర్తమాన భవిష్యక్కాలాలు, ఆయా క్రియాజన్య విశేషణాలకు తచ్చబ్ద౦ చేరిన రూపాలు- విశేష్యరూపాలే క్రియార్థాన్ని పొందాయి. వానిలో కాలక్రమాన కలిగిన శాబ్దకమైన మార్పుతో ఈ అర్థ విపరిణామం రూఢమైంది. వండినవాఁడు-విశేష్యము- క్రియ; రెండోదశలో వండినాడు - క్రియ. ఇలాగే వండుచున్న వాఁడు -వండుచున్నాఁడు, వండఁగలవాఁడు -వండగలఁడు, వండఁగలఁడు; వండెడు/వండెడివాఁడు > వండే వాఁడు (విశేషార్ధంలో). తచ్చబ్ధవకారం లోపించిన సంగ్రహరూపాలు తిక్కన కాలంనుంచి కావ్యభాషలో ప్రవేశించాయి. నన్నయలో ఇవిలేవు.
నన్నయకాలంలో 'కలుగు' ధాతువు సకర్మకంగాను, అకర్మకంగాను వాడబడింది. ఎఱుకగలవె అనేది సకర్మక ప్రయోగం. పధ్నాలుగో శతాబ్ధం నుంచి ఈ వాడుక లోపించి సహాయకక్రియగానే ప్రయోగించబడింధి. ఇతర సంయుక్తక్రియలకంటె భవిష్యద్రూపం అర్వాచీనం. నన్నయ నన్నిచోడులలో భవిష్యత్క్రియ అరుదు. నన్నిచోడునిలో ఒకే ఒక ప్రయోగము - కలబ్యను బంధంతో - కానవచ్చింది. మిమ్ము గౌల్వఁగల వాఁడన్ (కు. సం. 7-184).