పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్య భాషా పరిణామం 233

తద్ధర్మ 'ద' ప్రత్యయలోపంతో పూర్వస్వరదీర్ఘం కలిగిన రూపాలు: పెట్టించెదను - పెట్టించేను (SII VI 16, కడపజిల్లా 1396), ధరించెదము - ధరించేము (SII V 52, కర్నూలుజిల్లా, క్రీ.శ. 1515) ఇత్యాదులు. తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తనల్లో ఇలాంటివి ప్రధానంగా ప్రథమపురుషలో వండేని, చేసేని అనేరీతి ప్రయోగింపబడ్డాయి. ఈ రూపాలన్నీ కవిత్రయయుగపు కావ్యభాషలో ఎక్కలేదు.

7.29. వ్యతిరేకార్థకక్రియ : ధాత్వంతమందలి చకారము వ్యతిరేకార్థకం పరమైనప్పుడు పకారం అవుతుంది : ఒనర్చు-ఒనర్పడు కవిత్రయయుగం తర్వాత ఇలా పకారం కాని రూపాలు వాడుకలోకివచ్చాయి.

వ్యతిరేకక్రియ అర్థత్రయబోధకమవుతుంది. ఉదా : భూతం : నలుగానమివ్వనమ్మున (భార. 3-2-107); వర్తమానము : పలుకదు సఖులతో లలితాంగి (భార. 3-2-26); భవిష్యత్తు: నలునకాని నలిదళనేేత్రవరియింప దట్టి (భార. 8-8-52). వ్యతిరేకక్రియల్లో కాలం సూచించదలచినప్పుడు అగు-సహాయకక్రియ రూపాలను చేర్చిచెప్పడం ఉంది. ఉదా : నన్నయ : ఎఱుగనయితిని, నమ్మనేర నయ్యెదను, లేదవు ఇత్యాది. ఈ అగుధాతువు అనుప్రయుక్తమైన రూపాలు క్రమంగా తరవాత యుగంలో తగ్గిపోయాయి.

7.30. ఉభయ ప్రార్థనార్థంలో కావించు, కావింతము; పుచ్చు-పు త్తము అనురీతినిగాక ఈ యుగాంతానికి కావించుదము వంటి రూపాలు వాడుకలోకి వచ్చాయి. వెదుకుదము, చెప్పుదము, చూతము అనుటకు పాల్కురికిసోమన ప్రయోగాలు వెదకుదండు, చెప్పుదండు, చూతండు (ఖ.వు. ఉపో. పు 120) వంటివి మాండలికాలు కావచ్చును. విధ్యర్థంలో ఉండకుండునది అనటానికి ఉండకున్నది అనురూపం నన్నయలో ప్రయుక్తమైంది : దుర్జనయోధవరులకడ నుండకున్నది (భార. 1-8-206).

7.31. నిషేధార్థకం: ఏకవచనంలో వండకు-వండకుము అని రెండు రూపాలున్నాయి. అమ్మాదులు చేరినప్పుడు సంధికలుగు సందర్భాల్లో సర్వనామ ప్రత్యయంతో కూడిన రూపాలే ఉండాలని సర్వనామరహితాలు నిషేధాలనీ అధర్వణకారికావళి అనుశాసనం : తలంపకమ్మ-అలాక్షణికము: తలంపకుమమ్మ అని ఉండాలి.