Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

232 తెలుగు భాషా చరిత్ర

శ్రీనాథుని చాటుపద్యాల్లో ఇట్టివి ప్రయుక్తాలు, యుకారాంతాల్లో లాగానే చుకారాంత ధాతువుల్లోను ఇలాంటి రూప పరిణామం జరిగింది. ఇచ్చి-ఇచ్చితిమి-ఇస్తిమి; మన్నించు-మన్నింస్తిమి. ఇలాంటి రూపాలు 11 వ శతాబ్ధ౦నుంచి శాసనాల్లో ప్రయో గించబడ్డాయి. కాని ఇవి వ్యావహారికరూపాలుగానే పరిగణించబడ్డాయి.

7.28. తద్ధర్మార్థకక్రియ వర్తమానం భవిష్యత్‌కాలాల్లోనేగాక ప్రాచీన కావ్యాల్లో భూతకాలానికి కూడా వాడబడటానికి ఉదాహరణాలు కలవు. ఉదా: ద్యూతక్రీడకు కొండొకనేతున్‌ (=నేర్చి యున్నాను); విజితే౦ద్రియుండనగ నిమ్మునిఁబాయకవిందు (భార. 1-4-80) (= వింటిని).

అన్వాదులకు దు ప్రత్యయం చేరినపుడు నన్నయలో ఆండ్రు, కొండ్రు ఇత్యాది మూర్థన్యయుతరూపాలు కనబడుతున్నాయి. తిక్కనలో అందురు, కొందురు రూపాలున్నాయి.

చువర్ణా౦త ధాతువుపైన వచ్చే తద్ధర్మార్థక దుప్రత్యయం తకారంగా మారుతుంది. ఉదా: చూచు+దు+రు > చూతురు. ఇలాంటి మార్పురాని రూపాలు వ్యావహారికాలు. పదోశతాబ్ధంనాటి గంగాధర శాసనంలో 'ఇచ్చుదువ్‌' రూపంఉంది. (HGT. p. 346). ఇలానే అడచుదురు, ఆకర్ణి౦చుదురు. వీనిలో ధాత్వంత చకారం పకారంగా మారటం వ్యావహారికంలో కనిపించే మరోమార్పు. కవిత్రయంలో ఇలాంటి రూపాలులేవు. తరవాతికాలపు కవుల గ్రంథాల్లో ప్రవేశించాయి. ఉదా : ఆకర్ణింపుదురు (భాగవతం). నన్నయ భారతంలో 'పూజింపుదుము' అని ముద్రితప్రతిలోని పాఠం (ఆర. 2-255). తాళపత్ర ప్రతుల్లో 'పూజింతుము' అనే ఉందని ఆంధ్రభాషా చరిత్రకారుల సూచన (ఆం. భా. చ. వు. 1494). చుకారాంత ధాతువుల్లోలాగే యుకారాంత ధాతువుల్లోనూ 'ధ' కు 'త' ఆదేశమవడం మరొక వ్యావహారికరీతి. చేయు-చేయుదురు/ చేతురు.. ఇట్టి రూపాలు కవిత్రయంలో లేవుగాని నన్నిచోడాది దేశికవుల్లోను, అర్వాచీనమార్గ కవుల్లోను కన్పిస్తుంది ఉదా: చేతున్‌ (కు.సం. 1-5). సూరిఈ కారణంచేతే 'చేతురు, కోతురు' -ఇత్యాదులు అసాధువు లన్నాడు.

తద్ధర్మక్రియ 'పొందుదురు' ఇత్యాదుల్లో ప్రత్యయస్వరూపం మారి 'పొందుతారు' వంటి రూపాలు శాసనాల్లో 18వ శతాబ్దంలో లభించాయి. ( NI.1.కందుకూరు, 8 క్రీ. 1551).