పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్య భాషా పరిణామం 231

వృష్టిగురియుచు (భార. 1-7-107) వాన..గురిసి, ఒలుకు: కమండలు జలంబు లొలికిన (1-7-126), రక్తధారలొలక (1-2-126), పూను : హయములు పూనిన రథమెక్కి. (3-1-164). ఇద్దరును వూనిరి సర్వము నిర్వహింపఁగన్‌, మెఱయు ; విభూతి మెఱసి (కు. సం. 2-8). తరువాత కాలమునకు ఈ ధాతువులలో సకర్మకాకర్మక భేదాన్ని తెలపడానికి ప్రత్యయాలు చేరాయి. కురియ కురియించు/కురిపించు, పూను-పూన్చు, అగు-అవు, మెఱయు-మెఱయించు.

సంస్కృత ధాతువులు ఒకప్పుడు మూలార్థంలో నన్నయ వాడటంచేత మనకిప్పుడవి విలక్షణంగా తోస్తాయి. విహరించు, సకర్మక ప్రయోగము : అగ్నులు విహరింపుమని పంచి (భార. 1-1-29). విహరించు = విభాగించు. ఈ అర్థంలో తరువాతి కవులు వాడినట్లు లేదు.

కొన్ని సకర్మక క్రియలు కర్మలేకుండానే కావ్యభాషలో వాడటం కద్దు. నన్నయ : పొలువుగఁ బూసి కట్టితొడి, భూరి విభూతిప్రకాశితంబుగా (భార. 1-8-174).

చు, వు, ఇంచు ప్రేరణ ప్రత్యయాల్లో పకార రూపాలకు కాలక్రమాన వ్యాప్తి కలిగింది. నిండు-నించు, నింపు, చినుగు-పించు/చింపు, ఉడుగు-ఉడిగించు/ఉడివించు, ఉడుపు, మాయు-మాయించు, మాపు. నన్నిచోడుడు : మెచ్చించు (కు.సం. 1-21), తరువాతి కాలంలో మెప్పించు.

7.27. క్రియలు సంపూర్ణాలు, అసంపూర్ణాలు అని రెండువిధాలు, సంపూర్ణ క్రియల్లో ధాతువు, దానిపై కాలభావద్యోతక ప్రత్యయం, దానిపై సర్వనామ ప్రత్యయం చేరుతుంది. అసంపూర్ణ క్రియల్లో సర్వనామ ప్రత్యయం ఉండదు.

భూత తద్ధర్మార్థక సంపూర్ణక్రియల్లో ఉత్తమ పురుషైకవచనంలో సర్వనామ ప్రత్యయాలు చేరనిరూపాలే నన్నయ, నన్నిచోడులలో తరచుగా కనిపిస్తున్నాయి. భూతార్థక క్రియ 34 ప్రయోగాల్లోనూ కు. సం. లో 'వి' ప్రత్యయం కానరాదు. ఉదా : జడుఁడవై తెట్లు బ్రాహ్మణజాతిఁబుట్టి (7-27); తద్ధర్మార్థంలో వైకల్పిక పరిస్థితి : భిక్షకుఁదగిలి తపంబుసేసెదటే (7-21).

వ్యవహారంలో భూతకాలిక క్రియల్లో కలిగిన మార్పులు : (1) చేయు - చేసితిమి వంటి వానిలో ఇత్వలోపం కలిగి చేస్తిమి వంటి రూపాలేర్పడ్డాయి.