కావ్య భాషా పరిణామం 227
చతుర్ధికి : పిప్పికఱిగెడు నీగలపెల్లువోలె (కు. సం. 1-130).
పంచమికి : విలువిద్యనొరులు నీ కగ్గలముగ లేకుండునట్లు (భార. 1-5-289).
సప్తమి : కోమలి నీ కనురక్త (పై. 3-2-216).
సప్తమి:. తృతీయకు : సుస్వాగతాభిమత వాక్యములందభ్యాగ తోచిత సపర్యలఁదన్పెన్ (కు. సం. 7-5)
పంచమికి : జంగమమల్లయ వరమునందుఁ గనిన వస్తుకవిత
(కు. సం. 1-49), పూర్వాబ్ధిలో వెలువడి (పై. 10-111).
షష్టికి : అంతరంగగతి భేదము దెల్పె విదగ్ధముగ్ధలన్ (కు. సం. 5-151),
7.23. కారక విశేషాలు : కాలక్రమాన భాషలో కారక విధానంలో గూడా మార్పు కలుగుతుంది అనడానికి కొన్ని ఉదాహరణలు గ్రహిద్దాం. నన్నయ నన్నిచోడులు అలుగు, కరుణించు, అనుగ్రహి౦చు, సైచు మొదలైన క్రియలతో షష్టీకారకం ఉపయోగించారు. ఉదా : యయాతికి నలిగి (భార. 1.8.39), అరవిందంబుల కలిగి (కు. సం. 1-19), గిరిపతికి నమ్మునిపతి గరు ణించి (కు. సం), పౌష్యునకు ననుగ్రహించి (భార. 1-5-31), ఇతరోదాహర ణాలు : ఆక్షేపి౦చు : తద్గీర్వాణోరునదీ జితాఘముల కాకక్షేపించి (పై. 8-107); పరివేష్టించు : దాక్షాయణికిం శివగణికా సహస్రంబు పరివేష్టించి (పై. 2-16). తరువాత కాలములో ఇట్టి సందర్భాల్లో ద్వితీయాకారకం వాడబడింది.
ఈ కింది క్రియలతో షష్టీ , ద్వితీయలు రెండూ నన్నెచోడుడు వాడినాడు. తర్వాతి కాలంలో ద్వితీయకే వాడుక. ఉదా : రుద్రున కుఱక (4-67). విశ్వ సంహరు నుఱక (4-76). ఎయిదు : పరమేశ్వరున కెయిదనేరమికిన్ (6-145), ఉగ్రునెయిద౦దడవెద్ది (5-88).
అట, ఇటి, ఎట అను ప్రత్యయాలపై 'క' ప్రత్యయం చేరకుండటం నన్నయభాషలో విలక్షణంగా కనబడుతుంది. ఉదా : ఇటయేల వచ్చితి (భార. 1-2-210), ఇచ్చను పయెటవోయెడు. (పై. 3-2-107). ఇలాగే అక్కడ, ఇక్కడ, ఎక్కడ శబ్దములును కొన్నిచోట్ల ప్రయోగించబడ్డాయి : ఎక్కడం