226 తెలుగు భాషా చరిత్ర
రావచ్చును. 7వ శతాబ్ధంలో చీకుశబ్దం వాడుకలో ఉంది. (తిప్పలూరు శాస. AIXXVI. 231). దీని ఔపవిభక్తికలోపం చీకటి. ఇది నన్నయకాలానికి ప్రథమాంతంగా స్థిరపడపోయింది. నన్నయకాలంలో అమహత్సంఖ్యావచన విశేష్యం ఒకండు; దీని ఔపవిభక్తిక రూపం ఒకంటి అన్నది 13వ శతాబ్దానికి ప్రథమాం తంగా గ్రహింపబడి, ఒకండు కేవలం పుంలింగరూపమైంది. ఒకండు < ఒక + ఒన్ణు. దీనిలో “౦డు” పుంలింగప్రత్యయమనే భ్రాంతిచేత ఈ వాడుక కలిగింది.
7.22. విభక్తిప్రత్వయాలు : ద్వితీయ : నన్నయ గుఱించి రూపాన్ని వాడేడు. గుఱించి, గూర్చి తరువాతకవుల్లో ఉన్నాయి. తృతీయ : మెయిన్, తృతీయాంతంపై 'చేసి' నన్నయలోగలవు. ఉపయోగార్థంలో 'తోడ' వర్ణకం వాడేడు. చతుర్థి : కై (< కు + అయి). ప్రత్యయం విషయంలో అచ్చుతోనే యతిని పాటించటాన్నిబట్టి అతడు దీన్ని సమస్తపదంగానే భావించినట్లు స్పష్టం. 'కొఱకు' నన్నయ, నన్నిచోడుల్లో లేదు. పదమూడో శతాబ్దంనుంచి వాడబడింది. 'పొంటె' ప్రాజ్నన్నయ-కొఱవిశాసనంలో వాడబడింది. నన్నయవాడినాడు. పంచమి: కన్నన్ అర్వాచీనరూపం. 'ఉండి' ప్రాచీనకావ్యాల్లో సప్తమ్యంత రూపాలపై వాడబడింది. అర్వాచీనగ్రంథాల్లో ప్రథమేతర ప్రాతిపదికపై - సామ్యాన - చేరింది. దాన-నుండి, దాని-నుండి. అనుచితవిభాగంవల్ల ఉండి > నుండి.
విభక్తిప్రత్యయం - కొన్ని ఉదాహరణలు
ప్రథమ : అజడంబు ద్వితీయకు : అనిలజవంబునన్ బఱచు నమ్మద నాగమెదిర్చి. (భార. 1-4-207), జడంబు తృతీయకు : విగతరోషుఁడవై సుఖముండు మింక (భార. 1-7-129).
చతుర్ధికి : కాలంబు వేచెదను. జయంబునకున్ (భార. ఉ. 1-175).
షష్టికి : దుష్టోరగ సంహారమిప్పుడొడఁబడవలనెన్ (భార.1-2-137).
సప్తమికి : భూతి సర్వాంగముల్ పూయుచో (బ.వు.)
షష్టి : ద్వితీయకు : చిరముగ బ్రహ్మకున్ దపముసేసి (భార 1-2-138).
తృతీయకు : యుద్ధముసేసిరి భటులు శౌర్యదర్పోన్నతికిన్ (కు. సం. 11-124).