కావ్య భాషా పరిణామం 225
పరిస్థితి. తిక్కనకాలానికి రువర్ణంతో ఉన్న కూతురు రూపం మీదనే బహువచన ప్రత్యయం, ప్రథమేతర విభక్తిప్రత్యయం చేర్చటం సంభవించింది. ఇట్టి కూఁతుండ్రు, కూఁతురులు, కూతురి- రూపాలు వాడుకలోకి వచ్చాయి. తిక్కన ఇలాంటి రూపాలు వాడినాడు.
బహువచనరూపాల్లో మువర్ణలోపం, పూర్వస్వరదీర్ఘం కలిగినవి నన్నయలో లేవని, తిక్కన, శ్రీనాథులు వాడారని గమనించాలి. కళ్యాలన్ (భార.), ముత్యాలు (భార), మీసలు (భాగ. 6-92), ఇక్కడ కావ్యభాషకు శాసనభాషకు ఉన్న భేదం ఒకటి గమనించాలి ఉంది. రు, లు అంతంలోగల శబ్దాలు బహువచ నలు ప్రత్యయంతోకూడి డ్లు-బహు. వ. రూపాలు సిద్ధిస్తున్నాయి. నీరు+లు> నీడ్లు, కాలు + లు > కాండ్లు, ఎంగిలి + లు > ఎంగిడ్లు. కావ్యభాషలో 'ళ్ళు' బహువచనాలే ఉన్నాయి : నీళ్ళు, కాళ్ళు, ఎంగిళ్ళు.
తెలుగులో నామమే ప్రథమైకవచనం. డుజ్, ములు మహదమహత్ ప్రత్య యాలేకాక, తరుచుగా దేశ్యాల్లో 'వు' కూడా అంతమందు కనబడుతూ ఉంటుంది. ఆ-వు, పూ-వు, చెఱు-వు ఇత్యాదులు. వీటిలో వువర్ణ విరహితరూపాలే ప్రాచీ నాలు, కాలక్రమాన హలంత శబ్దాల సామ్యాన వీటిపైనకూడా ఒక ఉకారము చేరగా సంధ్యక్షరంగా వకారం బయలుదేరి వుకారాం తాలయ్యాయి. ప్రాచీన పూ శబ్దము సమాసంలో మనకు లభిస్తుంది. 'కాలకంఠుని శిరసు వూ గగనగంగ' అని శ్రీనాథుని ప్రయోగం. తరువు, గోవు వంటితత్సమ శబ్దాల్లోను 'వు' ఉచ్చారణవశాన చేరిందనవచ్చు.
7.21. అనౌపవిభక్తిక శబ్ధాల్లో ప్రథమేతర విభక్త్యంగం ప్రథమారూప తుల్యం. ఔపవిభక్తికశబ్దాల్లో -ఇ, టి, తి ప్రత్యయాలు చేరతాయి. ఈ ప్రత్యయాల వాడుకలో కాలక్రమాన కొన్ని మార్పులువచ్చాయి. ఔపవిభక్తికశబ్ధాలు కొన్ని అనౌపవిభక్తికాలుగాను, అనౌపవిభక్తిక శబ్దాలుకొన్ని ఔపవిభక్తికాలుగాను వ్యవహ రించడం జరిగింది. ఉదా : కన్నీరుధారలు (కు. సం. 5-85 )/ కన్నీటిధారలు, పాతటికిన్ (ఉ. హరి.). అర్వాచీనరూపం : పాతరకున్. ఏకకాలంలో ఒకే శబ్దం రెండు భిన్నప్రత్యయాలతో వాడబడవచ్చు. నీరి (భార. 1-5-196)/ నీటి (భార. 1-3-201), మొదలి (పై. 2-2-144)/ మొదలింటి.
ఒక్కొక్కప్పుడు ఔపవిభక్తికాంతం ప్రథమాలోపంగా వాడుకలోనికి
(15)