222 తెలుగు భాషా చరిత్ర
కు. సం. : అహాపుట్టింపదే. కాని క్రమంగా దీనికి వ్యాప్తితగ్గి సాంస్కృతిక శబ్దాలపైన ప్రవర్తి౦చడం పోయింది.
తిక్కన కాలంనుంచి చతపలకు సదవలు ఆదేశంగారాని రూపాలు కొన్ని కావ్యభాషలో ప్రవేశించాయి. అప్పా చెల్లె౦డ్రు (నిర్వ. 3-96), రాకపోకలు (భాగ.) అవ్యయాలమీద, క్రియాపదాలమీద ఇతర నామపదాలమీద వస్తూండే గసడదవాదేశం తరవాతి కాలంలో తగ్గిపోయింది.
7.16. హల్లు + అచ్చు : తెలుగు శబ్దాల్లో ద్రుత నకారం ఒక్కటే చివర వుండే హల్వర్ణ౦, ఈద్రుతానికి గల విశేషమేమంటే ఇది లోపించినా శబ్దార్థానికి భంగం కలుగదు. ద్రుతాంతాలైన పదాలు ద్రుతపకృతికాలు. ఇతరాలు కళలు.
నన్నయ కళలుగా ప్రయోగించిన శబ్దాలు కొన్ని తరువాతి కాలంలో ద్రుత ప్రకృతికాలైనవి. ఏను, నేను, తాను ఎల్ల. ఉదా : ఏను విదపడిగియెద - (భార. శల్య- 2-833), ఏనువోయెద (బస. పు.), ఎల్లయందు (భార. 1-2-157), ఇందు ప్రత్యక్ష౦బయన్నన్ -అని యుద్ధమల్లుని బెజవాడ శాసన ప్రయోగం. ఇలాగే ప్రాచీన కాలంలో ద్రుతప్రకృతికాలుగా ఉన్నవి కొన్ని అర్వాచీనభాషలో కళలుగా మారి పోయాయి. కొన్ని ఏక కాలంలోనే ద్రుతప్రకృతికంగానూ, కళగను వాడబడ్డవి కలవు. ఉదా : ఏనిప్రత్యయం : ఎందేనినుండి (భార. 1-8-181), ఎయ్యేనియు నొక్క (భార 1-4-128).
పదాంత హల్లుకు అచ్చుపరమైతే హల్లు ద్విత్వంకావటానికి ఉదాహరణాలు ప్రాచీచ కావ్యాలలో చాలా ఉన్నాయి. ద్రుతద్విత్వసంధి దీని కిందికే వస్తుంది. ఉదా : పరిచర్య లౌనర్చుచున్న పరిమిత నిష్టా, అన్నిష్టసఖి (భార్ 1-3.140), నవ్వులన్నలరులకిచ్చె (కు.సం. 9-108). ఇలాంటి సంధి విధానంచేతనే మన్నాస/-పల్లఱవు, కన్నాకు మొదలైన సమాసాల్లోను, ఝుమ్మని, గ్రక్కని మొదలైన ధ్వన్యనుకరణశబ్దాల్లోను ద్విత్వవాల్లేర్పడి ఉంటుంది.
పదాంతంలోని విసర్గరేఫగా మారడం పాల్కురికి సోమనాథుని రచనల్లో ఒక విశేషం. ఉదా : ధేనురనె, విష్ణురనcగ, వాయురన (పం. చ.)
7.17. హల్లు + హల్లు : ద్రుత నకారానికి పరుషం పరమైతే నకారం తన నాదత్వాన్ని ఆ పరుషానికి ఆపాదించి దానిని నాదస్పర్శంగా మార్చివేస్తుంది. కచటతప ఇలా గజడదబలుగా మారుతుంది. కావ్యభాషలో ఇది సర్వసాధారణం.