కావ్య భాషా పరిణామం 221
(భార. వి. 4-112) (ఇది శబ్దపల్లవమని కొందరు), వెఱచిట్లు (నిర్వ. 5-88), ఎఱి:గెఱి౦గి (భాగ. 9-515). షష్టీ ఇకారం లోపించినదాని కుాదాహరణలు : నరునునికి (భార. 1-8-167), జమనిల్లు (భార. 2-209), కృష్ణునల్లుడు (ద్రో. 2-248), దీనంఘ్రులు (శృ౦.నై.) .
తత్సమ శబ్దగత ఇకారం కూడా సామాన్యంగా లోపించదుకాని లోపించిన ప్రయోగాలు లేకపోలేదు. వ్యవహార భాషలో ఇలాంటి సందర్భాల్లో అర్థభంగం నివారించడానికి ఊత మొదలైనవి ఉంటాయి. వ్యవహార బలాన్ని బట్టి కావ్యభాషలో ఈ ప్రయోగాలను గ్రహించారని చెప్పాలి.
7.14. అత్వసంధి : ఆర్యాంబాద్యర్థక శబ్దాల విషయంలో అత్వసంధి కలుగటానికి కారణం ఇవి కేవలం లింగబోధకాలుగానో, ఆదరార్థకములుగానో శబ్దంపై చేరుతుండటం. అపుడు దీనిని అపదాది స్వరసంధికింద పరిగణించాల్సి ఉంటుంది.
అత్వలోపంతో కూడిన మరొకసన్నివేశం : చింతాకు, తనంత, చేయకుండెను వంటి రూపాలు నన్నయాది ప్రాచీన గ్రంథాల్లో యడాగమంతో కూడిన రూపాలే ప్రచురంగా ఉండగా కాలక్రమాన సంధికలిగిన రూపాలు వ్యవహారబలంచే కావ్యభాషలో ప్రవేశించాయి. స్త్రీవాచక శబ్దాల్లోను, షష్టీరూపాలలోను అత్వం లోపించకుండటం సామాన్య విధి, లోపించిన ఉదాహరణలు కవిత్రయయుగం నుంచి ఉన్నవి. ముందరిందద్రు పంచిన (భార. 1-8-238), అంతవమానము (భార.సభా. 3-203), ఉర్వీశులొద్ద (భార, 1-7-221), దేహే౦ద్రియంబు లిచ్చలు (కు. సం. 6-65), భక్తులిండ్లు (బ.వు)
సంబోధన అకారం లోపించదు. బసవ వురాణంలో దీనికి అపవాదాలైన ప్రయోగాలు విలక్షణాలు : అమ్మలా రక్కలారని; జైనులారెన్నడు.
7.15. అచ్చు + హల్లు : ప్రథమమీది పరుషం-అనగా పూర్వపదాంత సర్వానికి పరపదాది శ్వాస స్పర్శం పరమైనప్పుడు అది అజ్మధ్యస్థమగుట సంభవించగా అప్పుడది వర్ణ సమీకరణంవల్ల నాదస్పర్శం/శ్వాసోష్మంగా మారుతుంది. కచటతపలు వరసగా గనడదవలుగా మారుతుంటాయి. ఈ సంధికార్యం ప్రాచీన కాలంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉండేది. భారత ప్రయోగాలు : ఏమి సేయుదు, ఏమిసెప్పుదు, పెద్దవోయె, ధారుణివాలింతె, ధర్మజుండు దపంబు సేసిన,