Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

220 తెలుగు భాషా చరిత్ర

1. పూర్వస్వరం శబ్దానికి ఆవయవికంగా గాని వ్యాకరణ ప్రక్రియను బోధించేదిగాగాని ఉన్నప్పుడు ఆ అచ్చుపై సంధ్యక్షరం ఒక్కటి చేరుతుంది. కావ్యభాషలో యకారం మాత్రమే సంధ్యక్షరంగా వస్తుంది.

7.13. పూర్వ పదాంతస్వరం ఉత్వమైతే దానికి నిత్యలోపం. అది ఇత్వ మైనపుడు 1. మధ్యమ పురుష క్రియలలోని ఇత్వం నిత్యంగా లోపిస్తుంది, 'నిత్యమ నుత్తమ పురుష క్రియాస్వితః' అని ఆంద్ర శబ్దచింతామణి సూత్రము, “అనుత్తమ” పురుష శబ్దానికి 'మధ్యిమపురుష' యని కొందరు; ప్రథమ మధ్యమ పురుషలని కొందరు భిన్నరీతుల్లో అర్థం చెప్పారు. నన్నయలో మధ్యమపురుష ఇకారానికి నిత్యంగా, ప్రథమోత్తమ పురుషల్లోని ఇకారానికి వైకల్పికంగా లోపం కలుగుతున్నది. తరువాతి గ్రంథాల్లో మధ్యమపురుషలోను లోపించని ప్రయోగాలు కనబడుతున్నాయి. మొత్తంమీద ప్రాచీన గ్రంథాల్లో సర్వనామ ప్రత్యయ ఇకారం నిత్యంగానూ, వైకల్పికంగానూ లోపిస్తూన్నదనీ, లోపంకలిగిన రూపాలే ప్రాచుర్యమనీ గ్రహించాలి. సర్వనామ ప్రత్యయాలలోని అచ్చు ఉచ్చారణవశాన ఏర్పడ్డది. కాబట్టే అది లోపించడం సహజం. ఇకారాంతాల్లో చాల సందర్భాల్లో ఈ అచ్చు ఆవయవికం గనుక ఆ సామ్యంచేత. అచ్చు లోపించని రూపాలు క్రియాపదాల్లో ఉంటాయి.

ఏమ్యాది గణంలోని ఇకారానికి వైయాకరణులు వైకల్పిక లోపం చెప్పారు. కాని నన్నయలో అచ్చు లోపించడంలేదని ఆంధ్రభాషా చరిత్రకారులు సూచించారు (ఆం. భా వ. పుట. 1342). వైకల్పిక సంధి తరువాతి కాలంలో కలిగిందన్న మాట.

నామాల్లో ఇకారం లోపించిన రూపాలు విరళంగాఉన్నాయి. కవిత్రయంలో కన్నా శివకవుల్లో ఈ రూపాలు అధికం. ఉదా : రాతిరెల్ల (భార. 1-6-160). కంచేడు వాడల (బస. పురా), వావెఱు౦గని (పం, చ). చెఱొక్క (భార. ఉద్యో 1-219), తెలివెందునున్‌ గలదె (భార. ఉద్యో. 2)

క్త్వార్ధక ఇకారం, షష్ట్యర్థ ఇకారం వ్యాకరణార్జాన్ని బోధించేవి కాబట్టి ఇవి లోపించకుండడమే సహజం, సామాన్యవిధి. లోపం జరిగిన రూపాలు నన్నయలో లేవుగాని దేశి కవులలోను తిక్క నాదులలోను కనబడుతున్నాయి. పొంగెఱగెడు (కు. సం 11-72), వెఱచుండుము, ఏతెంచారగించె. (బస. పురా), అందిమ్ము