Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

216 తెలుగు భాషా చరిత్ర

మహాప్రాణత్వం ఎక్కడ కలుగుతున్నదో చెప్పడానికి ఆస్కారం కనబడదు. కనుకనే యాదృచ్చిక మనడం. శాసనాల్లో ఇలాంటి ఉదాహరణలు విశేషంగా ఉన్నాయి. సుఖము, వంచన. సంక్రాంథి, పాధిక, అప్పము, భండి, భెల్లము - ఇత్యాదులు. బసవ పురాణంలో ఒకచోట 'భావి' అనే ప్రయోగం ముద్రిత ప్రతులలో ఉన్నది. ఇది తప్ప ఇటువంటి రూపాలు శివకవులలోనూ కానరావు. సంఖ్యా వాచక సమస్త పదాల్లో మహాప్రాణత్వం స్థిరపడి ఆధునిక యగంలో శిష్టరూపాలైనవి : ముప్పై, నలభై, ఏబై , డెబ్బై, ఏనభైై, తొంభై, ఇరవై, అరవై - రూపాలకు ఇరబై, అరబై మాండలికాలు ఇప్పటికీ వ్యవహారంలో ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఈ రూపాలు వినబడతాయి.

2. ఆది సంధ్యక్షరంగా ఇ ఈ, ఎ ఏ లు యకారాన్ని, ఉఊ, ఒఓలు సకారాన్ని గ్రహిస్తాయి. ఉదా. యింద్రుండు, యెఱుగు, యేగు, పుదధి, వోపిక, కావ్యభాషలో ఈ రూపా లెవరూ వాడకపోయినా లాక్షణికులందరూ ఈ ప్రమాదం వుందని గుర్తి౦చి కవుల్ని హెచ్చరించారు. అధర్వణు డంటాడు : “ఆద్యవర్ణాస్తు హల్త్వేన నగృహ్య౦తే కదాపిచ” అని, "యకారంబును వువూ వొవోలును తెలుగు మాటలకు మొదటలేవు” అన్న సూత్రంలో సూరి ఈవిషయాన్నే జ్ఞాపకం చేస్తున్నాడు.

3. సంయుక్తమధ్య సంధ్యక్షరాలు : న, మలు రేఫ సంయుక్తాలైనప్పుడు ఆ సంయుక్తాక్షరంమధ్య వరసగా దకార బకారాలు సంధ్యక్షరాలుగా చేరడం శాసనోదాహరణాలనుబట్టి తెలుస్తూంది. బుద్దన్దృిపాలి సామబ్రాజ్య, ఏకామ్బ్రనాథ ఇత్యాదులు. HGT. P. 57). ఇలాంటి రూపాలు కావ్యభాషలో కెక్కలేదు.

4. శ-స లు: వ్యవహారంలో తాలవ్య, దంతోష్మ ధ్వనులు -శ -స లు తారుమారవడం అతి ప్రాచీన శాసనకాలం నుండి కానవస్తూంది. సాధారణంగా తాలవ్యాచ్చుతో కూడినప్పుడు సకారం శకారోచ్చారణం పొందుతున్నది. ఉదా: వేంచేసిన, శేయించిన, శేవలు. తద్భవాల్లో శకారం సకారంగా మారడం మరొక ధ్వనిపరిణామం. ఉదా: సిరస్సు, సుభము, సివరాత్రి-రూపాలు పామరజన వ్యవహారంలో ఉన్నవి. వీటి ఫలితంగా భాషలో ఫల ఉచ్చారణలో విశేషమైన వ్యత్యయం కలిగింది. ఇటువంటిరూపాలు కావ్యభాషలో చేరకపోయినా. అప్పకవ్యాదులు హేచ్చరిస్తారు. సకలము, సకృత్తు శబ్దాలను శకలము, శకృత్తు అని వ్రాయవద్దని