పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్యభాషా పరిణామం 215

నన్నయనాటినుండి కావ్యభాషలో కనబడుతూనే ఉన్నాయి. ఉదా : నన్నయ: తొడుగు-తొడ్డు, పొలతి-పొల్తి, ఉనికి-ఉన్కి. నన్నిచోడుడు : కుడిచి-కుడ్చి, మఱిగి-మర్గి.. కాని ఇట్టి రూపాలకు దేశికవులల్లోను, శాసన భాషలోను వాడుక హెచ్చుగా కనబడుతుంది. పాల్కురికి సోమన ; పెరుగు-పెర్గు, కసవు-కస్వు ఇత్యాదులు.

వ్యవహారంలో ఊతలేని అక్షరంలో ఆఙ్లోపం సహజమే. వ్యావహారిక భాషా ప్రభావం చేతనే ఇలాంటి స౦గ్రహ రూపాలు తరువాతి కవుల గ్రంధాల్లోనూ, అనేక విధాలైన శబ్దాల్లో ఏర్పడ్డాయి. తిక్కన : వాలింగీలియు. (<వాలియును. నిర్వ,రామా. 7-93); భావనామాలు : అంట (<అనుట), కొంట (<కొనుట). 'పాండు నృపాలు పాలు గైకొంటయె చాలు' నని తిక్కన ప్రయోగము (భార-ఉద్యో). పొలతి-పొల్తిలో జరిగినటువంటి మార్పే కొనుట-కొంట లోనూ జరిగింది. అయినా 'కొంట' వంటి భావనామాలు నన్నయలో లేవని కాబోలు పరిహరింపదగినవని అధర్వణ అహోబలులన్నారు. పొల్తి, కొంట అనే రూపాలేర్చడినట్లే పదాంత వర్ణంలో ఉత్వలోపం వలన అన్నం, సున్నం, సముద్రం వంటి రూపాలేర్పడ్డాయి. అయినా ఇవి వ్యావహారికాలుగానే నిలిచి పోయాయి. మహాకవి ప్రయోగాలనుబట్టి, వాని బాహుళ్యాన్ని బట్టి లాక్షణికులు శబ్దాల సాధుత్వా సాధుత్వాలను నిర్ణయిస్తారు.

పదాంతము వర్ణంలో ఉత్వలోపానికి ఉదాహరణాలు 11 వ శతాబ్దం నుండి లభిస్తున్నాయి. ఆదివారంనాణ్డు (SII 10-75), ఆచంద్రతారకం (పై. 4-1364, 1356, 1213), శతాబ్ధం (పై. 10-660), బాణపురం (పై. 5-1313). 15వ శతాబ్దానికి వ్యావహారికభాష సర్వత్రా వ్యాపించింది. కాని పైన చెప్పినట్టు దీనివల్ల కావ్యభాషలో కలిగినరూపాలు చాల తక్కువ.

వ్యావహారిక భాషా రీతులు ;

7.10. కావ్యభాష వీటివల్ల ప్రభావిత౦ కాకపోయినా సమకాలంలో జరుగుతూ ఉన్న వ్యావహారిక భాషాపరిణామాలు కొన్ని మనం ఇక్కడ గుర్తించవలసి ఉంది. పదాంత ఉత్వలోపం ఒకటి పైన చెప్పబడింది. ఇతరాలు.

1. యాదృచ్చిక మహాప్రాణత్వము : అల్పప్రాణ వర్ణాలు కొన్ని మహా ప్రాణవర్ణాలుగా ఉచ్చరించ బడుతూ ఉండినట్టు లేఖనాన్నిబట్టి ఊహించుకోవచ్చు.