కావ్యభాషా పరిణామం 213
తరవాత కవులకూ ఈ విషయంలో ఉన్న భేదం క్షకారోచ్చారణంలో గలిగిన మార్పుకు సూచకం కావచ్చు.
4. ఙ్ఞ: పై దానిలోలాగ ఙ్ఞ వర్ణోచ్చారణములోనూ కాలక్రమాన భేదమేర్పడింది. నన్నయ దీన్ని చ ఛ జ ఝ లతో కలపగా తిక్కన కకారంతో యతి కలిపినాడు. ఆధునిక వ్యవహారంలోను ఈ రెండు భిన్నోచ్చారణలు మాండలికంగా ఉన్నాయి.
5. దేశ్యశబ్దాల్లో దీర్ఘంమీద అనుస్వారాన్ని తేల్చి పలుకుతూ ఉండేవారు. ఇలా తేల్చి పలకడం సంస్కృత శబ్దాల్లో లేదు. ఉదా : వాcడు; భాండము. కనుకనే నన్నయ దేశ్యాలను సంస్కృతాలను ప్రాసలో కలపడు. కాని కొన్ని మండలాల్లో దీర్ఘంమీది అనుస్వారాన్ని పలుకుతూ ఉండేవారు. నన్నిచోడుడు ఈ మాండలికోచ్చారణని అనుసరించి దేశ్య సంస్కృత శబ్దాలకు దీర్ఘ పూర్వక బిందుప్రాస కలిపినాడు. (కు.సం 1-4; 2-82). పూర్ణబిందువు ఉచ్చారణలో భ్రష్టమైన కారణంచేత తిక్కనాదులు సబిందు, నిర్బిందు ప్రాస నుపయోగించారు. (ప్రా. వ్యా. భా. పుట 233), దీర్ఘంమీది అనుస్వారాన్ని తేల్చి పలకడం, ఊది పలకడం అనే ఈ రెండు మాండలిక సంప్రదాయాలు ప్రాఙ్నన్నయయుగం నుండి ఆధునిక యుగం వరకు వస్తూనే ఉంది. ఉదా : ఆండది-ఆడది; . తోంక- తోక; కోంతి-కోతి,
- ధ్వనుల మార్పులు:
7.6. లోపదీర్ఘత : ఇది ప్రాఙ్నన్నయ యుగంలోనే ప్రారంభమై వ్యవహారంలో క్రమంగా వ్యాప్తి చెందినట్టు శాననాలనుబట్టి తెలుస్తూంది. మొదట్లో ఈ రూపాలు కేవల వ్యావహారికాలై శిష్ట భాషలో ప్రవేశం లేకపోవడంచేత నన్నయ వీటిని వాడలేదు. వ్యవహార ప్రాచుర్యాన్ని బట్టి తిక్కనాదులు క్వాచిత్కంగా వాడారు. ఉదా : మరాకుము>మరువకుము (భార. ఉద్యో); కళ్యాలన్ >కళ్యములన్. (విరాట. 1-65); నమ్మీనమ్మక < నమ్మియు నమ్మక (శా౦తి. 2-35). ఛాతుజ విశేషణాలమీది తచ్చబ్ద వకార లోపంతో కారకక్రియ లేర్పడ్డంలో ఈ ధ్వని పరిణామమే కనబడుతుంది. నన్నయ కాలంలో 'వండినవాడు' వంటి రూపం తిక్కన కాలానికి. 'వండినాcడు' అయి కావ్యభాషలో అంగీకరించ బడింది. ద్రుతలోపం వల్ల కలిగిన ధీర్ఘా౦తాలు చాలా (<చాలన్), కూడా (కూడన్),