212 తెలుగు భాషా చరిత్ర
వచ్చును. సామాన్య వ్యవహారంలో మాత్రం ఇవి ప్రాచీన కాలంలో రి,లి లు గాను ఆధునిక కాలంలో రు, లు లుగాను ఉచ్చరించ బడుతున్నాయి. నన్నయ-భారతంలో ఋ-రి యతి రికారోచ్చారణాన్ని సూచిస్తుంది. తరువాతి కవులు నన్నయ ననుసరించి ఋ-రి యతిని పాటించారు. కాని శాసనభాషనుబట్టి కవి ప్రయోగాల్లో అప్రయత్నంగా దొర్లిన ఋ-రు యతిని బట్టి 12 వ శతాబ్ధంనుండి రుకారోచ్చారణము ఈ ధ్వనికి కలిగిందని ఊహించవచ్చు. ఉదా. పాల్కురికి సోమన : రు రు వర్ణదేహంబు ఋగ్వేదమునకు (పండితారాధ్య చరిత్రము). తిక్కన: సప్తఋషలైరి వారు మరుద్గణంబునకు (భార, శల్య, 2-160).
2. ర-ఱ; రేఫ శకట రేఫలు నన్నయ భాషలో భిన్న వర్ణాలుగానే ఉండినవి. అంటే వాటికి భిన్నోచ్చారణము ఉండినదని అర్ధము. ర కంటే ఱ అధిక కంపనము కలది. నన్నయ నన్నిచోడుల గ్రంధాల్లో ఈ ధ్వనులకు సాంకర్యం లేదు. కాని కాలక్రమాన ఱ కారం తన విలక్షణోచ్చారణమును కోల్పోయి సాధు రేఫగానే పలుకబడుతూ వచ్చింది. ర-ఱ ల కలయిక క్రమంగా అధికంగా కనబడు తుంది. 15 వ శతాబ్దానికి ఱ కారం పూర్తిగా భాషలో లోపించి పోయిందని చెప్పవచ్చు. అప్పటినుంచి లాక్షణికులు రేఫ, ఱకార నిర్ణయ పట్టికలు వ్రాయటానికి పూనుకోవటమే దీనికి నిదర్శనం. నన్నయాది ప్రాచీన గ్రంథాలు పరిశీలించగా పదాల్లో ర-ఱ ల ద్వైరూప్యం కానవస్తుంది. ఒకేపదం ఒకప్పుడు సాధురేఫతోను, మరొకప్పుడు శకటరేఫతోను వ్రాయబడి ఉండటం. ఉదా : నన్నయ : అరుదు/అఱుదు; ఊరార్చు/ఊఱార్చు; కురంగలి/కుఱంగలి; క్రుమ్మరియెదు/క్రుమ్మఱియెదు; చీరు/చీఱు; చెదరు/చెదఱు; తూరు/తూఱు; దరికొను/దఱికొను; నెఱయు/నెరయు; పఱగు/పరగు; పెఱుగు/ పెరుగు; ముందఱ/ముందర - ఇత్యాదులు. తరువాతి కాలపు వ్రాయసకాండ్రు తమ కాలంలోని వర్ణక్రమాన్ని ప్రాచీన గ్రంథాల్లో వ్రాయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుంది. కూతురు శబ్దము సాధు రేఫతోనే నన్నయ నన్నిఛోడుల ముద్రిత గ్రంథాల్లో కానవస్తూండగా, 11-12 శతాబ్దాల శాసనాల్లో ఈ పదం నియంతగా శకటరేఫతోనే వ్రాయబడి ఉంది.
8. క్ష: క్ష కారాన్ని నన్నయ భారతంలో క ఖ గ ఘ లతోనే మైత్రి కల్పించబడిందిగాని షకారము, దాని మిత్ర వర్ణాలతోకాదు. అంటే ఈ సంయుక్తాక్షరంలో క్షకారోచ్చారణానికే ప్రాముఖ్యం ఉందన్నమాట, నన్నెచోడుని గ్రంథంలో క ష లు- రెండింటికీ మైత్రి కలదు. ఇలాగే తక్కిన గ్రంథాల్లోనూ ఉంది. నన్నయకూ