Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్య భాషా పరిణామం 211

హల్లులు : :క ఖ గ ఘ జ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల ళ వ శ ష స హ.

1. అచ్చుల్లో ఋ ౠ ఌ లు హల్లులలో మహా ప్రాణవర్ణాలు ఖ ఛ ఠ ధ ఫ ఘ ఝ ఢ ధ భ శ ష లు సంస్కృత సమాల ద్వారా తెలుగున ప్రవేశించాయి.

2. దేశ్యాల్లో 'అఇ' లు 'అఉ' లు సన్నిహితంగా ఏకవర్ణస్ఫూర్తి కలిగేట్టు ఉచ్చరించబడగా ఏ, ఔ లు ఏర్పడ్డాయి. ఉదా : అయిదు>ఐదు : అవును>ఔను. అంతేకాని ఇవి ఈ భాషకు సహజ ధ్వనులు కావు. సంస్కృతాని కివి సహజాలు : ఐరావతము; ఔషధము.

3. ఙ ఞ లు వాని వర్గాక్షరాలకు ముందే వస్తాయి. సంయుక్తంలోనే కాని వ్యస్తంగా వానికి ప్రయోగం లేదు.

4. వర్గాక్షరానికి ముందు వచ్చే వర్గానునాసికం అనుస్వారంగా వ్రాయటం సంస్కృత భాషా ప్రభావంవల్ల కలిగింది. కాబట్టే దేశ్య శబ్దాల్లో అనుస్వారానికి వర్గానునాసికం విలువయే ఉన్నది. తద్భిన్నోచ్చారణం సంస్కృత శబ్దాల్లో కానవస్తుంది. ఉదా : సంయమి; సంహారము.

5. (:) విసర్గ - అనగా శ్వాసహకారం. తెలుగున పదమధ్యంలోనే వస్తుంది. ఉదా : దుఃఖము, ఆంతఃకరణము, తపఃఫలము. దీనిని వర్ణాంతరంగా కాక హకారానికి సవర్ణంగా చెప్పుకుంటే సరిపోతుంది. హకారం అఙ్మధ్యస్థంగాను, విసర్గ హల్పూర్వంగాను ఉంటాయి.

వర్ణోచ్చారణ విశేషాలు :

7.5. (1) ఋ, ఌ: వీనికి తెలుగున లేఖన చిహ్నా లేర్పడి ఉన్నవి గనుక ఈ ధ్వనులు తత్సమాల ద్వారా ఈ భాషలోనికి ప్రవేశించాయని తలంచ