210
తెలుగు భాషా చరిత్ర
సమగ్రంగా తెలియలేదు. నిజానికి ఆ యా కాలపు కవుల రచనలు సూక్షంగా పరిశీలించి సమగ్రమైన వర్ణనాత్మక వ్యాకరణాలు వరసక్రమంలో వస్తేనేగాని శాస్త్రీయంగా భాషాచరిత్ర చెప్పలేము. ఉన్నంతలో మనకు లభించే భాషాసామగ్రిని ఆధారంగా చేసుకొని కవిత్రయయుగం భాషను చారిత్రక దృష్టితో అన్వయించటానికి ప్రయత్నం చేద్దాం.
7.3. పదకొండు - పధ్నాలుగు శతాబ్దాల కాలం కవిత్రయ యుగం, శ్రీనాథుడు పదిహేనో శతాబ్ధానికి చెందినవాడు. కావ్య భాషలో 14-15 శతాబ్దాల మధ్య ఎక్కువ భేదం కనబడదు. కాబట్టి తెలుగుభాషా చరిత్రలో 1000 నుండి 1500 వరకు కవిత్రయ (పురాణ) భాషా యగం అని వ్యవహరించవచ్చు.. దీనికి ముందు ప్రాఙ్నన్నయ యుగం, దీని తరువాత ప్రబంధ (ఆధునిక) యుగం ఉన్నాయి. ఇలా ఆంధ్రభాషా చరిత్రను ప్రధానంగా మూడు యుగాలుగా విభజించవచ్చు. వీటిలో మళ్ళీ కొన్ని అవాంతర దశలు ఉన్నాయి ప్రాఙ్నన్నయ యుగంలో తొమ్మిదో శతాబ్దంలో కొన్ని ప్రధానాలైన మార్పులు జరిగాయి. కవిత్రయ యుగంలో పదమూడో శతాబ్ది తిరిగిన కాలం చాల ముఖ్యమైంది. ఎందుక౦టే పదకొండు, పన్నెండు శతాబ్దాల్లో లేదా అంతకుముందు బయలుదేరిన భాషా స౦ప్రదాయాలు ఈ కాలానికి స్థిరపడ్డాయి. ఉదాహరణకు : పదమధ్య/పదాంత వర్ణ౦ లోపించి పూర్వస్వరానికి దీర్ఘ౦ కలగడం ప్రాఙ్నన్నయ యుగంలో ప్రారంభమైంది. ఆ పరిణామం క్రమంగా వ్యాపించి అనేక రూపాల్ని మార్చివేసింది. ఇది ఉచ్చస్థితిని అందుకొన్నది పదమూడో శతాబ్దంలో. మళ్ళీ పదహారో శతాబ్దం భాషా చరిత్రలో ప్రధాన ఘట్టం ఆధునికాంధ్రభాషా రూపేర్పడుతున్న కాలమది.
ఈ కింది. శీర్షికల్లో చెప్పబడే చార్మితక వ్యాకరణాంశాలు 1000-1500 కాలానికి చెందినవని గ్రహించాలి.
కవిత్రయ యుగంనాటి కావ్యభాషా స్వరూపం
ధ్వనులు :
7.4. 11-15 శతాబ్ధాల మధ్యకాలంలో ఈ కింది భాషాధ్వనులు కనబడుతున్నాయి.
అచ్చులు: అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ఎ ఏ ఒ ఓ ౦.