కావ్య భాషా పరిణామం
209
శక్షికాను కొట్టంబున పాఱకుఇచ్చిన పన్నన ఇరవది యాదినాల్కు మఱున్తుఱ్లునేల'. పండితుని రచనలో అలా ఉండేది వాక్యం.
పై చర్చకు సారాంశమేమంటే ప్రాఙ్నన్నయ యుగంలోనే కావ్యశైలి ఏర్పడింది. దానికాధారాలు ఏడో శతాబ్ధంనుంచి కనబడు తున్నాయి.
చారిత్రక వ్యాకరణం
7.1. కావ్యశైలి రూపొందిందంటే కవితా వ్యవసాయం చాలాకాలంగా జరుగుతూ ఉందన్నమాట, కాని నాటి వాఙ్మయ మెలాంటిదో, దాని స్వభావమేమిటో తెలుసుకోవటానికి మన కిప్పుడు ఆధారాలు లేవు. ప్రాఙ్నన్నయ యుగం పద్య శాసనాలు ఇంతవరకు దొరికినవన్నీ దేశీయ ఛందస్సులోనే ఉన్నాయి. దేశ వాఙ్మయం ఆనాడు విశేష ప్రచారం పొందిఉండినది అనడానికి సందేహంలేదు. పాల్కురికి సోమనాథుని రచనలనుబట్టి, ఆ వాఙ్మయం విసృతి వైవిధ్యాలను కొంతవరకు ఊహించుకోవచ్చు. శిష్టులెవరూ ఆ దేశిని ఆచరించక పోవటం చేతను, అది శిష్టకవి ప్రయుక్తం కాకపోవటం చేతను, లాక్షణికులు దాని లక్షణ నిర్దేశంలో శ్రద్ధ వహించలేదు. నన్నయమార్గ కవితా ఫక్కి ఏర్పడిన తర్వాత దేశిమార్గం క్రమంగా మాసిపోయింది. దేశి కవులు లాక్షణిక కవులుగా పరిగణింపబడలేదు. లేకపోతే నన్నిచోడ, పాల్కురికి సోమనాథులు అంతకాలం అజ్ఞాతంగా ఉండి పోవటం ఎలా సంభవిస్తుంది ?
నన్నయ మూలాన వెనుకటినుంచి వస్తూన్న కావ్య భాషకు పుష్టి చేకూరింది. అతడు గ్రంథస్థం చేసిన భారతభావ గ్రాంథికమై తరువాతి వారికి అనుసరణీయమై రాచబాట అయింది. ఆ మాన్యుడు ఆ మూడు కృతులలో “నుడువు తెఱగు' లరసి కొనియే తరువాతి మార్గకవులందరూ తమ రచనలను సాగించారు.
7.2. కవిత్రయ యుగానికి సంబంధించిన భాషా చరిత్ర వ్రాయటానికి అవసరమైన సామాగ్రి అంతా మన కిప్పటికీ సమకూడిందనటానికి వీలులేదు. ఇటీవల బయలు వెడలిన నన్నయ, నన్నిచోడుల పదప్రయోగ సూచిక లాధారంగా వారి భాషాస్వరూపాన్ని గురించి పరిశోధన జరిగింది. పాల్కురికి సోనునాథాది శివకవుల భాషా విశేషాలను పండితులు కొందరు పరిశ్రమించి ఆయా గ్రంథాలకు ఉపోద్ఘాతంలో తెలిపి ఉన్నారు. కాని ప్రధానుడు తిక్కన భాషకు పర్యాప్తమైన పరిశీలన జరగలేదు, తరువాతి కవుల భాషాస్వరూపాన్ని గురించి కూడా మనకు
(14)