పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

204

తెలుగు భాషా చరిత్ర

క్రియ ఉండవచ్చు. అసమాపక క్రియతో అంతం అయ్యే ఉపవాక్యాలన్నీ సామాన్య వాక్యాల పరివర్తిత రూపాలే.

క్త్వార్ధకం : ఉపవాక్యం చివర ఉండే క్త్వార్ధకక్రియ, ప్రధాన వాక్యంలోనీ క్రియా వ్యాపారానికి ముందు జరిగే వ్యాపారాన్ని సూచిస్తుంది. ప్రథాన వాక్యంలోను, ఉపవాక్యంలోను సాధారణంగా కర్త ఒకటేఅయి ఉంటుంది. ఉదా.సాహెబులగారు నుయి గట్టించి ప్రతిష్టజేసె (SII 10.760.8-10, 1668). క్త్వార్ధక క్రియలు హేత్యర్థకాలుగా కూడా కనిపిస్తాయి. ఉదా. ..... అన్నారెడ్డి మోకు మీద నుండి సభామధ్యమందు పడి మృతిబొంద్దె (NI 2 కందుకూరు 41.23-25 1683). క్త్వార్ధక్యక్రియ రీత్యర్థకంగా కూడా కనిపిస్తుంది. ఉదా. .... యి ధర్మమాచరించి ... దనరు (SII 18.772.22,1696). వ్యతిరేక క్త్వార్ధకం కూడా హేత్వర్థకం అవుతుంది. ఉదా. ... మరహంమతు చేయించక అచ్చెద్ద చేసినాడు (SII 10.765. 38-40, 1678).

శత్రర్థకం : ఉపవాక్యంలో శత్రర్థంలో ఉండే క్రియ ప్రధాన క్రియతో పాటు జరిగే వ్యాపారాన్ని సూచిస్తుంది. ఉదా. .... భక్షిస్తాను యమపురికి యెంగును (NI 2 కావలి 50.16, 1636).

చేదర్థకం : ప్రధాన వాక్యంలో క్రియ బోధించే వ్యాపారం ఉపవాక్యంలోని వ్యాపారంమీద ఆధారపడి ఉన్నప్పుడు ఇలాంటి వాక్య నిర్మాణం జరుగుతుంది. ఉదా: ఇందుకు తురుకలు తప్పితే పంది మాంసానకు ఆసించ్చిన పాపాన బోదురు (SII 10.769 22-24,1691)... -ఇతే/తే తో పాటుగా-ఆ కూడా చేదర్థాన్ని ఇస్తుంది. ఉదా. అది తప్పి నడిపించ్చిరా వాండ్ల మానం మాలమాదిగెలకు ఇచ్చిన వాండ్లే (NI 2 నెల్లూరు 115 8-10,1635).

అప్యర్థకం : ఈ వాక్యాలలో రెండు వ్యాపారాలకు వైరుధ్యం ఉంటుంది. ఉదా. ఆ పొలము తాండి కొండ్డది అయ్యిన్ని ... ఆపరిమివారు తాండి కొండపొలము గరకసా చేసేదియేమి? (SII 10.759.23-25,1663).

6.49. సంబంధబోధక వాక్యాలు : ... యిందుకు యవ్వరు ఆక్షేపణ సేతురో వారు శ్రీవైష్ణవ ధర్మంలో వారుగారు. (NI 8 పోదిలి 1.23-25,1642) వంటి సంస్కృత భాషా ప్రభావం వల్ల కావ్యభాషలో ప్రవేశించిన సంబంధ బోధక యత్తదార్థక వాక్యాలు ప్రధానంగా శాసనాల్లోని శాపయుక్త (imprecetory) వాక్యాల్లో మాత్రమే కనిపిస్తాయి. నామపదాలకు విశేషణాలుగా వర్తించే వాక్యా