శాసన భాషా పరిణామం
203
కరుండవు (SII 6.79.13,1796). అఖ్యాతనామం సంబంధ బోధక నామంకూడా కావచ్చు. ఉదా. ... ఆ పొలము తాండికొండది,.. (SII 10.759.23, 1663). అగు ధాతువు వ్యతిరేకార్థక రూపాన్ని చేర్చటంవల్ల పైన చెప్పిన వాక్యాల్లాంటి సమీకరణీయ వాక్యాలు వ్యతిరేకార్థక వాక్యాలవుతాయి. ఉదా...(అది)...పరిమి పొలము కాదు (SII 10.759.21,1663).
క్రియాసమాపక వాక్యాలు : ఆఖ్యాతంలో సమాపక క్రియ ఉంటే క్రియా సమాపక వాక్యం అవుతుంది. ఇవి అకర్మక వాక్యాలని, సకర్మక వాక్యాలనీ ప్రధానంగా రెండు రకాలు. అకర్మక వాక్యాలలో కర్మ ఉండదు. సకర్మక వాక్యాలలో ఉంటుంది. ఉదా. వర్తకులు ... ఉండిరి (SII 10.770.9.1691), కవులు శిలాశాసనం వ్రాసిరి (SII 10.769,22-27,1697).
క్రియా సమాపక వాక్యాలలోనే విధ్యాద్యర్థక వాక్యాలుంటాయి. విధి: విధి వాక్యాలలో ధాతువుకు ఏకవచన౦లో-ము, బహువచనంలో-అండి చేరుతుంది. కర్త ఎప్పుడూ మధ్యమ పురుషలో ఉంటుంది. ఉదా. .. సంధ్యాదీపానకు ముట్టింపుము (NI 2 కావలి 20.4-6, 789-90). బహువచన రూపాలు ఇంతకు ముందు కాలంలోని శాసనాల్లో ఒకసారి మాత్రమే కనిపించింది. ఉదా. .. అది పాలించి పుణ్యం లానను సేయండి (NI ఆత్మకూరు 30.31, 462). ప్రశ్న: ప్రశ్న వాక్యం ఒకటి మాత్రమే ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా. .. చంద్రుడితో ..... వివాదకు వచ్చినావా? (SII 6.79.23-14 1796). ప్రశ్నార్థక పదాలైన ఎవడు, ఎవరు మొదలైన వాటితో ప్రత్యేకంగా ప్రశ్నార్థక సామాన్య వాక్యాలు శాసనాల్లో కనిపించక పోయినా యత్తదర్థక వాక్యాలను ఇలాంటి వాక్యాలు ఉన్నా యనటానికి నిదర్శనంగా గ్రహించవచ్చు. వ్యతిరేక: ఉండు/ఉన్ ధాతువు వ్యతిరేక రూపమైన లేదు చేర్చటంవల్ల వ్యతిరేక వాక్యా లేర్పడుతున్నాయి. ఉదా. యిక్కడ సుంకం...లేదు (SII 10.753.59,1600). భూతకాల వ్యతిరేక క్రియతో అంతమయ్యే వ్యతిరేక వాక్యం. బలిమి సేయలేదు (SII 10:753.48,1600). నిషేధం: నిషేధార్థక క్రియలతో అంతమయ్యే వాక్యాలు నిషేధ వాక్యాలు. ఉదా. నను నింద సేయవలదు (SII 5.1208,36.1773).
6.48. సంశ్లిష్టవాక్యాలు : అసమాపకక్రియతో అంతం అయ్యే ఒకటి గాని, కొన్నిగాని ఉపవాక్యాలతో కూడిన సామాన్య వాక్యాలు సంశ్లిష్టవాక్యాలు. యత్తదర్థకవాక్యాల్లో, అను కృతివాక్యాల్లో మాత్రం ఉపవాక్యంలో కూడా నమాపక