Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

202

తెలుగు భాషా చరిత్ర

(3 ) ప్రశ్నార్థకం:. ఆ ప్రశ్నార్థకం; ఉదా. వచ్చినావా? (SII 6.79.14, 1796). (4) పోలిక: పోలిక చెప్పటానికి ఆధునిక భాషలోలాగా - లాగు(ను) ఉపయోగించటం కనిపిస్తుంది. ఉదా. యిచ్చేలాగునున్ను(NI 2 కందుకూరు 48.42, 1650).

6.46. వాక్య నిర్మాణం : వాక్యనిర్మాణ పద్ధతుల్లో గతయుగాలకూ, ఈయుగానికి ఆధునిక యుగానికి చెప్పుకోదగ్గ భేదా లేమీ లేవు. పైగా శాసనాలు పరిమిత ప్రయోజనం, పరిమిత ప్రయోగాలు కలిగినవి కాబట్టి సమకాలీన భాషలోని వాక్యనిర్మాణాన్ని సమగ్రంగా విశ్లేషించటానికి అవకాశం లేదు. అయినా లభించిన ఆధారలపైననే కొన్ని ప్రత్యేక విషయాలను పేర్కొనవచ్చు. క్రియాసమాపక వాక్యాలు, నామ సమాపక వాక్యాలు రెండూ ఈ కాలపు శాసన భాషలో కనిపిస్తున్నా క్రియాసమాపక వాక్యాల ప్రయోగమే ఎక్కువ, వాక్యంలో పదబంధాల విన్యాస క్రమంలోకూడా మార్పులు లేవు. ప్రాచీన శాసనాల్లో సంస్కృత ప్రభావంవల్ల, కావ్యభాషలో ప్రవేశించిన యత్తధర్ధక వాక్యప్రయోగాలు నాలుగు మాత్రమే కనిపిస్తుండగా (§ 3.73) ఈ కాలంలో సుమారుగా శాప (imprecatory) వాక్యాలన్నీ యత్తదర్ధక వాక్యాలుగా కనిపిస్తాయి. కర్మణ్యర్థక వాక్యాలు ఈ యుగంలో అసలు కనిపించవు. వ్యావహారిక భాషకు దగ్గరగా ఉండే శాసన భాషలో కర్మణ్యర్థక వాక్యాలు కనిపించక పోవటంవల్ల ఈ వాక్యనిర్మాణం తెలుగుకు సహజం కాదనీ సంస్కృత భాషా ప్రభావంవల్ల మాత్రమే కావ్యభాషలో ప్రవేశించిందని చెప్పవచ్చు. ప్రాచీన శాసనాల్లో మూడు సార్లు మాత్రమే ఈ ప్రయోగాలు కనిపిస్తాయి [§ 3.74).

శాసన భాషలోని వాక్యాలను ప్రధానంగా సామాన్య వాక్యాలనీ, సంశ్లిష్ట వాక్యాలనీ, సంయుక్త వాక్యాలనీ మూడుగా విభజించవచ్చు.
6.47. సామాన్య వాక్యాలు : సామాన్య వాక్యాలు నామ సమాపకాలనీ, క్రియాసమాపకాలనీ రెండు రకాలు.
  నామసమాపక వాక్యాలు : ఆఖ్యాతంలో నామం ఉంటే నామ సమాపక వాక్యం అవుతుంది. నామ సమాపక వాక్యాలుగా సామాన్య వాక్యాలు ఈ యుగంలో తక్కువగా కనిపిస్తున్నా, శానన భాషలో మొదటినుంచీ ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగానే కనిపిస్తాయి. ఉదా. దామయ్య ముత్తతాత (SII 10.732.69.70,1500). వారు దోషులు (NI 2 కందుకూరు 85.20,1516). అఖ్యాత నామం

మధ్యమ, ఉత్తమపురుష ప్రత్యయాలనుకూడా స్వీకరిస్తుంది. ఉదా. నీవు దోషా-