పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

200 తెలుగు భాషా చరిత్ర

    6.40. విధ్యాద్యర్థకాలు : తద్ధర్మార్థక విశేషణాలకు అది చేరగా ప్రాచీన నిశ్చయార్థకా లేర్పడుతున్నాయి. ఉదా. వుండునది (NI 3 ఒంగోలు 102.23,1762). -ఏ -ది (<ఎడి-ది) చేరటంవల్ల ఏర్పడే ఆధునిక రూపాలు ఈ కాలంలో విరళంగా కనిపిస్తాయి. ఉదా. వుండేది (SII 10.769.22,1691). గుంటూరు, కృష్టా జిల్లాలలో -ఏ -కు బదులుగా -ఇ- కూడా కనిపిస్తుంది. ఉదా. అనుభవించిది ( SII 5.1221.12, 1809). వుండువారు (NI 2 కందుకూరు 41.44,1683) వంటి ప్రాచీన నిశ్చయార్థకాలు కూడా సమకాలీన శాసనాల్లో కనిపిస్తున్నాయి. అన్నంతాలకు వలయు, వలెను చేరటంవల్ల ఏర్పడే నిశ్చయార్థకాలు కూడా విరివిగా ఈ కాలపు శాననాల్లో కనిపిస్తాయి. ఉదా. కావలెను (NI 3 రాపూరు 18.12, 1622). విధ్యర్థకాలలో కట్టించ్చుము (KI 48.6, 1613) వంటి ఏకవచన రూపాలే ఈ కాలపు శాసనాల్లో దొరికాయి. బహువచనంలో -ఆండి సేయండి (NI 1 ఆత్మకూరు 30.31, 1462) వంటి రూపం 15వ శతాబ్దికి సంబంధించిన శాసనంలో కనిపిస్తుంది.
    6.41. ఆశీరర్థకం : -గాత చేరిన ప్రాచీన ఆశీరర్థకరూపం ఈ కాలంలో కనిపిస్తుంది. ఉదా. ఈడేర్చుకో -గాత (NI 3 రాపూరు 60.33.1612).
    6.42: వ్యతిరేకార్థకాలు : -ఆ- -ø-, వ్యతిరేకార్థక ప్రత్యయాలు. దీర్ఘంపైన -ø-, ఇతరత్ర -అ- చేరుతుంది. ఉదా. లే-ø- దు (SII 10.759.33,1663), కా -ø- వు (SII 10.768.13,1658).
    అన్నంతంపైన లేదు చేరటంవల్ల ఏర్పడే సేయ-లేదు (SII 10.753.48, 1600) వంటి భూతకాల వ్యతిరేకార్థక క్రియలు, మొదటిసారిగా ఈ యుగప్రారంభంలో కనిపిస్తాయి.
    సేయ-వలదు ( SII 5.1203.36,1773 ) వంటి వ్యతిరేక నిశ్చయార్థక రూపాలు ప్రాచీన రూపాలుగా ఈ కాలపు శాసనాల్లో కూడా కనిపిస్తున్నాయి.
    6.43. అసమాపక క్రియలు : (1) క్త్వార్ధకం ఇ. చూచి (SII 6.79.13,1796). (2) శత్రర్థకం:- చు. (ప్రా.రూ) -తు ఉదా: యేలుచు (SII 10.706, 1678), చేస్తూ (KI 53. 11,1812). తా/త కూడా ఈ కాలంలో విరళంగా కనిపిస్తుంది. ఉదా: యిస్తా (SII 10.770. 15,1699). ఈ