Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

196 తెలుగు భాషా చరిత్ర

ఉదా. నలుగురు (SII 10.758. 18,1658), పదునెనిమిది మంది (NI 3 ఒంగోలు 132.11,1443).

6.30. విశేషణాలు : విశేషణాల విషయంలో ఈ యుగంలో కొత్తగా చెప్పుకోదగ్గ విశేషాలేమి లేవు. -లాగు చేర్చిన ఆధునిక సంకీర్ణ విశేషణాలు యిచ్చే (లాగు NI 2 కందుకూరు 48.42.1450), యిలాగు (SII 10.751.14,1592), చూచేలాగు (NI 2 కందుకూరు 48.36,1650) వంటివి 15వ శతాబ్ది నుంచీ కనిపిస్తున్నాయి. బాగా (<బాగుగా) (NI 2 కందుకూరు 45.50,1650) 17వ శతాబ్దిలో మొదటి సారిగా కనిపిస్తుంది.

6.31. క్రియలు :- క్రియా ప్రాతిపదికలు (1) సామాన్య (2) సంకీర్ణ (3) సమస్త - ఆని మూడు రకాలు, (1) పడు (NI 2 కందుకూరు 41.24,1683), చెప్పు (SII 5.1208,84, 1772) వంటివి సామాన్యాలు. (2) సామాన్య క్రియా ప్రాతిపదికలకు క్రియా కారకాలు చేరి ఏర్పడేవి సంకీర్ణాలు. (1) దేశ్యాలు: ఒనర్‌-చ్‌ -(SII 6.227,16,1636), నడివ్‌-ఇంచ్‌ ( SII 5.166.11,1624). (2) ఆదానాలు: సృజించ్‌ (SII 5. 1208.26,1778). దేశ్యాలలో -చ్‌, -ఇంచ్‌ సకర్మక, ప్రేరణార్థకాలయి ఉంటాయి. (3) సమస్త క్రియా ప్రాతిపదికల్ని రెండు రకాలుగా విభజించవచ్చు. (i) ప్రధాన క్రియలోనే సమాసం ఏర్పడేవి. (ii) సామాన్య, సంకీర్ణ లేక సమస్త క్రియా ప్రాతిపదికకు సహాయక క్రియచేరి ఏర్పడేవి. (i) ప్రధాన క్రియా సమాసంలో రెండవ అవయవం ఎప్పుడూ క్రియ అయి ఉంటుంది. మొదటిది నామంగాని, క్రియగాని కావచ్చు. (a) క్రియ+(కియ: పడ-వేన్‌ (SII 6.79.14,1796), చని-పోవు (KI 61.8, 19వశ.). నడిపించక-పోవు (NI 3 రాపూరు 18.21,1622), తెలుపు-కొన్‌ (SII 10.777.10,174౦). కౌన్‌ అనుబంధం ప్రాచీన భాషలో క్త్వార్ధకాలమీద చేరేది (§ 3.40). కాని ఈ యుగంలో అధునిక యుగంలోలాగా క్రియా ప్రాతిపదికలమీద మాత్రమే చేరుతుంది. -కొన్‌ అనుబంధంగా చేరటంవల్ల అక్మార్థక క్రియ లేర్పడతాయి. -కొని సంకుచిత రూపంగా -క 15 వ శతాబ్ది నుంచి కనిపిస్తుంది (§ 5,52). ఉదా. అనభవించ్చుక (SII 10.769,22,1681). ఈ యుగంలో -కుని అని ఆధునిక రూపం మొదటిసారిగా కనిపిస్తుంది. ఉదా. అనుభవించు కుని (SII 10. 771.16,1682). (b) నామం+క్రియ: కావ్‌-అడు (NI 2 కందుకూరు 48.66, 1650). (2) -ఉండు, -కల, -వలయు, -ఇచ్బ్‌ మొదలైన సహాయక