Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 195

ప్రధానాధారాలలో ఇది ఒకటి (కృష్ణమూర్తి 1968). కాని “నేము" అనేది అస్మదర్ధకంగానే శాసనాల్లో కనిపిస్తుంది.

ఆత్మార్థక బహువచనంగా తాము (SII 7.5571.0,1637) 16వ శతాబ్దినుంచీ కనిపిస్తుంది (§ 5.41). అంతకు ముందు తారు అనేది మాత్రమే కనిపిస్తుంది (పై). తులనాత్మకంగా పరిశీలిస్తే *తామ్‌ అనేదే మొదటి రూపం. ప్రాక్తెలుగు కాలంలోనే మానవ వాచక బహువచన ప్రత్యయమైన -ర్‌ అనేది -మ్‌ అనే దాని స్థానంలో మధ్యమ పురుష సర్వనామంలో (*నీమ్‌>నీర్‌ >మీరు) లాగా వచ్చి ఉంటుంది (కృష్ణమూర్తి 1968).

6.29 సంఖ్యా వాచకాలు : ప్రధమా విభక్తిలో “ఒకటి" అనే రూపం ఒకండు' అనే రూపాన్ని తొలగించి గత యుగంలోనే పూర్తిగా స్థిరపడింది. (§ 5.33). 'ఒక'కు బదులు 'ఓ' విశేషణంగా 13 వ శతాబ్ది నుంచే కనిపిస్తుంది(కందప్పచెట్టి § 2.119). “ఏను” అనేది పూర్తిగా వ్యవవర భ్రష్టమై 'ఐదు' (NI 3 రాపూరు 49.14,1638) అనేది మాత్రమే కనిపిస్తుంది (§ 4 48(4)) ). ఏను విశేషణంగా మాత్రమే కనిపిస్తుంది. ఉదా. ఏందుము (SII 10. 769.16, 1691). సంధ్యక్షరం -హ -తో కూడిన పదహారు (SII 18.285.15, 1558) వంటి ఆధునిక సంఖ్యా వాచక రూపాలు 16 వ శతాట్టి నుంచీ కనిపిస్తున్నాయి. కూడిక సంఖ్యలలో పదిలో చివరి అచ్చు లోపించిన పద్మూడో (SII 16.330.17,1647), పద్నాలుగు (SII 16.172 ,58,1620) వంటి రూపాలు, సమీకరణం వల్ల ఏర్పడ్డ పన్నెండు (<పండ్రెండు) (KI 58.9,1812) వంటి రూపాలు ఈ యుగంలో మొదటి సారిగా కనిపిస్తున్నాయి. సమాసాలలో -పదిలో -ద -> -య -మార్చు పొందిన రూపాలు ఇంతకుముందే భాషలో స్థిర పడ్డాయి (§ 4.48(11) 6). ఈ యుగంలో అలాంటి రూపాలు పూర్తిగా వ్యాప్తిలోకి వచ్చాయి. ఉదా. ఇరువై (SII 5.874.15,1620). తక్కిన సంఖ్యా వాచకాల విషయంలో గత యగాలకు ఈ యుగానికి పెద్దగా భేదం ఏమీ లేదు.

పూరణార్థకంగా -ఓ (<అవ<అవు<అగు) అనేదే ఈ యుగంలో కని వస్తుంది. ఉదా; నాల్గో (SII 10.753.36,1600). -గురు అనేదీ మహద్వాచక సంఖ్యావాచక విశేషణ సూచకంగా - వురు ఫ్టానాన్ని 12వ శతాబ్ది నాటికే ఆక్రమించింది ( § 4.48 (15) ). -మంది అనేది 15 వ శతాబ్ది నుంచీ కనిపిస్తుంది.