190 తెలుగు భాషా చరిత్ర
కొన్నాండ్లు (SII 10.755.7,1604) మొదలైనవి. చారిత్రకంగా కొన్నాండ్లు వంటి రూపాలు దీర్ఘంపైన పూర్ణబిందువు లోపించకముందు ఏర్పడ్డ రూపాలు అయిఉండాలి.
(7) -లుకు ముందు ద్విరుక్త హల్లులు అద్విరుక్తాలవుతాయి. ఉదా. గట్లు (ఏ. వ. గట్టు) (SII 10.753.30,1600), రెడ్లు (ఏ. వ రెడ్డి) (NI 1 కందుకూరు 12.48,1648).
(8) రెండు హ్రస్వాచ్చులు గల పదాలకంటే భిన్నమైన పదాలలో చివరి అకారం -లు కు ముందు లోపిస్తుంది. ఉదా. కట్టడ్‌లు (>కట్టళ్ళు) (ఏ.వ. కట్టడ) (NI 2 కందుకూరు 48.69,1650).
(9) -లు కు ముందు డ, ర, ల లు ళ గా మారుతాయి. ఉదా. అంగళ్ళు (ఏ. వ. అంగడిి (NI 2 కందుకూరు. 48.69,1650), మళ్ళు (ఏ. వ. మడి) (SII 10.758.13,1658), నీళ్ళు (ఏ. వ. నీరు) (NI 1 CP 9,39.1687), వాకిళ్ళు (ఏ. వ. వాకిలి) (SII 7.564.6,1667), వడ్లు (ఏ. వ. వరి) (NI 2 కందుకూరు 44.21,1650) లో వడ్డు (< * వఱ్) ని బహువచన ప్రాతిపదికగా గ్రహించవచ్చు.
(10) -ళ్ళు అనేది బహువచనంలో కొన్ని పదాలకు చేరుతుంది. ఉదా. రాళ్ళు (ఏ. వ. రాయి (SII 7.790.15,1714).
(11) -చివరి అచ్చు లోపించింతర్వాత ర ళ గా మారని అధునిక రూపాలు గత యగంనుంచే కనిపిస్తున్నాయి. (§ 5.27). అవి ఈ యుగంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నాయి. ఉదా. పేర్లు (ఏ.వ. పేరు) (NI క2 కందుకూరు 48.6,1650).
గౌరవార్థకాలుగా. -లు, -రు, వారు, అయ్యవారు -గారు, -గారలు మొదలైనవి ఈ యుగంలో కనిపిస్తున్నాయి. ఉదా. గురువు -లు (NI 2 నెల్లూరు 13.12,1613). దాసరి నాయని -వారు (SII 7,557.4.5, 1636), శ్రీరంగరాజయదేవ మహారాజులయ్యవారి (SII 7.564.4,1667). సాహెబుల -గారు (SII 10.760.8,1668) మొదలైనవి.