Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 189

6.25. వచనం : ఏకవచన సూచక ప్రత్యయాలు ప్రత్యేకంగా ఏమీలేవు. లింగబోధక ప్రత్యయాలతో కూడిన పదాలన్నీ ఏకవచనాలే. బహువచనంలో మాత్రం కింది విశేషాలను గమనించవచ్చు. మానవ వాచక బహువచన ప్రత్యయంగా -రు చాలా కొద్దిగా మాత్రమే ఈ కాలంలో కనిపిస్తుంది. -లు(*-ళ్) మానవ, మానవేతర సాధారణ బహువచన ప్రత్యయంగా స్థిరపడటాన్ని ఇంతవరకే గమనించాం (§ 4.39.). కందులు (SII 10.753.52,1600) మొదలైనవి నిత్యబహువచనాంతాలు. నామవాచకాలపైన - లు చేరేటప్పుడు కింది మార్పులు వస్తాయి.

(1) దీర్ఘా౦తాలై న అన్యదేశ్యాలకు, ఎకారాంతాలకు, అకారాంతాలకు, ట, డ, ర, ల పూర్వకంకాని ఉకారాంతాలకు బహువచన ప్రత్యయం చేరేటప్పుడు ఎలాంటి మార్పులు రావు. ఉదా. జాగాలు (SII 10.759.35-36, 1665), వొడ్డెలు (NI 2 కందుకూరు. 48, 34,1650). దొరలు (SII 10.753.39,1600), రోజులు (SII 10.772.3,1696).

(2) -లుకు ముందు పురుష బోధక ప్రత్యయం -డు లోపిస్తుంది. ఉదా. బ్రాహ్మణులు (SII 10. 753.39,1600).

(3) -లుకు ముందు ప్రాతిపదిక చివరి -వు, -ను, -యి, -రు లు లోపిస్తాయి. -వు లోపానికి మాత్రమే ఈ కాలపు శాసనాల్లో ఉదాహరణ దొరికింది. ఉదా. పూల - (ఏ. వ. పూవు (KI 53. 11, 1812).

(4) -లు కు ముందు -ము వర్ణకం లోపించి పూర్వ అకారం దీర్ఘ౦ అవుతుంది. ఉదా. కుంచాలు (ఏ. వ. కుంచము) (NI 2 కందుకూరు 44.28.1650),

(5) ప్రాతిపదిక చివరి - ఇకారం బహువచన ప్రత్యయం -లు కు ముందు ఉ గా మారుతుంది. ఉదా. పందులు (ఏ. వ. పంది) (NI 2 నెల్లురు 33.69,1645).

(6) ట,డ,ర,ల లు ము౦డుగల పదాంతంలోని ఇ,ఉ లు -లు కు ముందు లోపిస్తాయి. ఉదా. కోమట్లు (SII 10.753. 44, 1600).