Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

188 తెలుగు భాషా చరిత్ర

గోత్రులు (SII 5.1260.9.10,1604). (3) ద్వంద్వ సమాసం (Co-ordinative) ఉదా. మెరక పల్లాలు (SII 10.755.12,1604).

6.23. సమాసాలేర్పడేటప్పుడు మొదటి పదంలో వచ్చే మార్పుల విషయంలో కింది విశేషాలను ఈ యుగంలో గమనించవచ్చు. -ము వర్జకం స్థానంలో -పు రావటం ఇంతకుముందు చూశాం (§ 4.57 (గ) ), -పు ఆదేశం రాకుండానే సమాసం ఏర్పడటం ఈ యుగంలో చూడవచ్చు. ఉదా. గుఱ్ఱము బండ్లు (SII 10.753.56,1600). -ము, -పు అనే అమహద్వాచకాలైన రెండు సపదాంశాలలో -పు తొలగిపోయి -ము మాత్రమే మిగిలిందనటాన్ని ఇది సూచిస్తుంది. అయితే అధునిక భాషలో గుర్రంబండి, గురబ్బండి ( < గుర్రపు-బండి) అని రెండు రకాల రూపాల ప్రతి రూపాలు కనిపిస్తున్నాయి. రెండవ పద్ధతిలో సమీకరణం పొందిన రూపాలు ఈ యుగంలో కూడా కనిపిస్తున్నాయి. ఉదా. అను ప్పలె (<అనుపు-పల్లె < అనుము-పల్లె) (SII 10.757.11-12,1650).

6.24. లింగబోధక ప్రత్యయాలు : దేశ్య పదాలకు చాలావరకు లింగబోధక ప్రత్యయాలు లేవు. నామ వాచకాలకు -అన ( ), -ఆయ ( ), -అప్ప చేర్చటంవల్ల పురుష వాచకాలు, -అమ్మ,( ), -అవ ( ) మొదలైనవి చేర్చటంవల్ల స్త్రీ వాచకాలు గుర్తింపబడేవి. వీటికి వరుసగా ఉదాహరణలు. చింన్నన్న (SII 10,777.17, 17 వశ.), కోనయ (SII 6.227.14.15,1636), నారాయణప్ప (SII 10.750.19,1658). -అమ( ), -అవ ( ) చేర్చి స్త్రీ వాచకాలను గుర్తించే ఉదాహరణలు ఈ యుగంలో లెవుగాని గత యుగంలో ఉన్నాయి. ఉదా. లచ్చమ (SII 10 749. 88,1683), సోమవ్వ (SII 10.748.45.1583). _డు ( <ణ్ఞు < *-న్టు). పురుష బోధక ప్రత్యయంగా ఎక్కువగా అకారాంత తత్సమాలపైన కనిపిస్తుంది. పర్సో- అరబిక్ ఆదానాలలో పురుష నామాలమైన కూడా కనిపిస్తుంది. ఉదా. ఆలమఖానుండు (SII 10.751.18,1592). స్త్రీ బోధక ప్రత్యయాల విషయంలో ఈ యుగానికి గత యుగానికి పెద్దగా భేదం ఏమీ లేదు. ౦బు, -మ్ము, -ము లతో ప్రాచీన అహమద్వాచక రూపాలు కనిపిస్తున్నా -౦ మాత్రమే అమహద్వాచకంగా ఈ కాలంలో స్థిరపడిందని చెప్పవచ్చు. ఉదా. శాసనం (SII 10,777.15,1740). -వు కూడా అమహదేకవచన ప్రత్యయంగా ఉకారాంత, ఓకారాంత తత్సమాలపైన కనిపిస్తుంది. ఉదా. పస్వు (NI 2 కందుకూరు 48,31,1650).