పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 18౩

అచ్చుల మధ్య కనిపించే సంయుక్త హల్లులలో వర్గాను నాసికం + స్పర్శం క్రమంలో ఉండేవె తెలుగులో మొదటినుంచీ కనిపిస్తాయి. ప్రస్తుత శాసనాల్లో కనిపించే తక్కిన సంయుక్త హల్లులన్నీ పదమధ్యాజ్లోపంవల్ల ఏర్పడ్డవో, సంధి కారణంగా ఏర్పడ్డవో అయి ఉంటాయి. ఉదా. వేడ్క (<వేడుక) (SII 5,1208.24,1778), కోమట్లు (SII 10.770.18, 1691).

పదాంతంలో మ,య లు తప్ప ఇతర హల్లులు లేవు. 'య' యిరవై (SII 5.874.15,1620) వంటి సంఖ్యా వాచకాల్లో మాత్రమే కనిపిస్తుంది.

పదంలో మొదటి అక్షరంలో హ్రస్వం గానీ, దీర్ఘ౦ గానీ ఏ అచ్చైనా ఉంటుంది. అద్యేతరాక్షరాలలో ఒక్క 'ఒ' తప్ప తక్కిన హ్రస్వాచ్చులు మాత్రమే ఉంటాయి. రెండవ అక్షరంలో దీర్ఘాచ్చు గ్రామనామాల్లోను, వృక్షనామాల్లోను కనిపిస్తాయి. ఉదా. కొంబాక (SII 16.50.6-12,1513), నేరేళు (SII 10.787.44 1526). ద్వ్యక్షర పదాలైన గోనె (SII 10.758.52, 1600), కోడె (SII 10.758.57,1600) వంటి పదాల్లో మాత్రమే పదాంతంలో 'ఎ' కనిపిస్తుంది. మాదిగె (NI 2 నెల్లూరు 115.8-10,1675) వంటి త్యక్షర పదాల్లో కనిపించే పదాంత 'ఎ' కారం మాండలికం మాత్రమే (§ 6.8. (v) (c)).

ఇతర భాషలనుంచి వచ్చిన వర్ణాలు.

6.15. హింద్వార్య భాషా మూలాకాలు : హింద్వార్య భాషా పదాల ద్వారా కింది హల్లులు తెలుగులో చేరాయి.

ఫ థ ఠ ఛ ఖు భ ధ ఢ రు ఘ ష శ హ

సంస్కృతంలోని “ఋ” ప్రాచీన శాసనాల్లో 'రి' గా కనిపిస్తుండగా క్రీ.శ.12వ శతాబ్ది నుంచి 'రు'గా కనిపించటం ప్రారంభం అయింది (§ 4.7). ప్రస్తుత శాసనాల్లో అది ఎక్కువగా “రు” గానే కనిపిస్తుంది (§ 6.9. (a)). సంస్కృతాదానాలలోని ఐ, ఔ లను తెలుగులో ప్రత్యేక వర్ణాలుగా గ్రహించటానికి గాని (§ 6.11. (b)), సంస్క్భతంలోని అనుస్వారాన్ని, అది సంస్కృతంలో ప్రత్యేక వర్ణమైనా (ఎమ్. బి. ఎమెనో 1946:86-98), ప్రత్యేక