Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

182 తెలుగు భాషా చరిత్ర

లేఖనాధారా లున్నాయి (§ 6.4). స్పర్శాలకు ఆధునిక కాలంలో లాగా అచ్చుల మధ్య శిథిలోచ్చారణ (Lenis articulation) ఉన్నదని చెప్పటానికి లేఖనాధారాలు లేవు. “మ" కు అచ్చుల మధ్య అనునాసిక వకారోచ్చారణ ఉండేది. (§ 6.8(1) (f) ).“న" వర్ణానికి దంత్య, కంఠ్య స్పర్శాలకు, తాలవ్య, దంత మూలీయ స్పృష్టోష్మ్యాలకు ముందు వరుసగా దంత్య, కంఠ్య, తాలవ్య, దంతమూలీయ ఉచ్బారణలు ఉండేదని చెప్పవచ్చు. “ర” కు మూర్ధన్య హల్లులపైన మూర్ధన్యోచ్చారణ ఉండి ఉండాలి (§ 6.8.). 'స' కు తాలవ్యాచ్చులకు ముందు తాలవ్యోచ్చారణ ఉండేది (§ 6,8 (1) (g) ). తాలవ్యాచ్చులకు ముందు యకారం, ఓష్ట్యాచ్చులకు ముందు వకారం ఉచ్చారణలో మాత్రమే ఉండేది. (§ 6.8. (1) (అ) ). నిమ్నాచ్చులకు ముందు ఎ, ఏ లకు వివృతోచ్చారణ ఉండేది (§ 6.8. (i) (e).

6.14. వర్ణ సంయోజన నియమావళి : ణ, ళలు పదాదిన లేవు. ట కూడా పదాదిన చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉదా. టెంకాయ (SII 10.706.15,1678). “డ” వర్ణం పదాదిలో డెబ్బై (SII 4.698.67,1564)లోనూ, కొన్ని తద్భావాల్లోను కనిపిస్తుంది. ఓష్ట్యేతరాచ్చులకు ముందే 'వ' కనిపిస్తుంది. పదాదిలో ద్విర్తుక్త హల్లులు లేవు. పదాదిలో ఒకేరకమైన సంయుక్త హల్లులు - మొదటి వర్ణం క,త,ప,గ,ద,బ, స,మ,వ లలో ఒకటి, రెండవ వర్ణం ర వర్ణం అయినవి మాత్రమే కనిపిస్తాయి. వీటిల్లో రెండవ వర్ణం ర లోపించటం క్రీ. శ. 7/8 శతాబ్దులలో ప్రారంభమై క్రీ. శ. 14/15 శతాబ్దుల నాటికే పూర్తి అయిందని చెప్పాలి (§ 8.9.). కాబట్టి ప్రస్తుత శాసనాల్లో కనిపించే పదాది సంయుక్తాక్షరాలతో కూడిన వాటిని ప్రాచీన రూపాలుగాను, “ర” లోపించిన రూపాలను సమకాలీన రూపాలుగాను గ్రహించాలి (§ 6.8. (vi) (2)).

అచ్చుల మధ్య హల్లులన్నీ అద్విరుక్తంగాను, ద్విరుక్తంగానూ కనిపిస్తాయి: 'శ' మాత్రం ద్విరుక్తంగా మాత్రమే కనిపిస్తుంది. ద్యిరుక్త ఇకారం డ + న-ణ్ణ సంధి కారణంగా అంబరు భానుణ్ణ (SII 7.845.8,1682) మొదలైన మహద్ధ్వితీ యైకవచన రూపాల్లో 16వ శతాబ్దినుంచీ కనిపిస్తున్నాయి. ద్విత్వ హల్లులు సాధారణంగా హ్రస్వాచ్చులపైనే ఉంటాయి. పాళ్ళు (SII 10.758.87,1600) వంటి సంధి కారణంగా ఏర్పడ్డ రూపాల్లో మాత్రం దీర్ఘ౦పైన కూడా ద్విరుక్త హల్లులు కనిపిస్తాయి.