శాసనభాషా పరిణామం 179
(a) గ/వ: (ఆగు/) ఆపు (NI 2 కందుకూరు. 46.4,1682), (b) వ/గ: (మువురకు/) ముగ్గురికి (NI 1 దర్శి 61.13,1718). ఇంతకుముందు శతాబ్దాల్లో కనిపించే హ/య ల లేఖన భేదంకూడా ఇలాంటిదే అని గ్రహించాలి. ఉదా: పహిండి / పయిండి / పైడి (SII 4.1344.6,1470 / SII 4.702.104,1518/TTDES 3.32.2, 1512). (2) సాహిత్య/వ్యావహారిక రూపాల మిశ్రణం: బ్రతికేది (/బతికేది) (SII 10.771.15,1692), (మ్రాను/) మాను (NI 1 CP 8.24,1651). కొన్ని సందర్బాలలో ఇది ప్రాచీన వర్ణక్రమాన్ని పాటించటం వల్ల కూడా కావచ్చు. (3) ప్రామాణిక/అప్రామాణిక భేదాలు : ఇంతకు ముందరి శతాబ్దాలలో కనిపించే చ/స, చ/శ, శ/స, ష/స, తాలవ్యాచ్చుకు ముందు వకారం లోపించి, లోపించని రూప భేదాలు (రంగనాథాచార్యులు § 2.46.8)కాకుండా ఈ క్రి౦ది భేదాలు ఈ కాలపు శాసనాల్లో కనిపిస్తున్నాయి. (a)/ణ న: (పుణ్యము/) పున్యము (SII 5.120.5,1640). (b) త్స్య/చ్చ: ఉదా: (మత్స్యదేశ/) మఛదేశ (SII 10.776:4,1786), (c) శ్ర/చ్చ: ఉదా : (అశ్రర్ద/) అచ్చెద్ద (SII 10.765.40,1678). (vii) ఆ దానపదాల్లోని వర్ణాలకు లేఖనచిహ్నం లేనప్పుడు వాటికి తుల్యమైన ఉచ్బారణగల వర్ణాల చిహ్నాలను ఉపయోగించటం కనిపిస్తుంది. ముఖ్యంగా పర్సో-అరబిక్ ఆ దానపదాల్లోని f కు ప గాని, ఫ గాని x కు క గాని, ఖ గాని రాయటం కనిపిస్తుంది. ఉదా: ఫరుమానా/ పరుమానా SII 10.775.14,1680,/NI 2 కందుకూరు 48.15,1650).
6.9. విలోమ లేఖనం (Inverse Spelling) : వ్యుత్పత్తి గత పరిణామానికి భిన్నంగా వర్ణక్రమాన్ని వికృతీకరించటం విలోమ లేఖనం. (a) రు కు బదులుగా ఋ. ఉదా : పెకండృ (NI 2 కందుకూరు 41.17,1688). ఇది సంస్కృతంలోని ఋ కారానికి తెలుగులో రుకారోచ్చారణ ఉందనటాన్ని సూచిస్తుంది. (b) ధ కు బధులుగా థ: ఈ భేదం ఇంతకుముందు శతాబ్దాలనుంచే కనిపిస్తుంది. సంస్కృతాదానాల్లోని థ కార, ధ కారాలకు భేదం పోయిందనటాన్ని ఇది సూచిస్తుంది. ఉదా: వథ (వధకు బదులుగా) (SII 16.282.22,1572). (c) గ్నకు బదులుగా జ్ఞ రాయటం కూడా ఇంతకుముందు శతాబ్దాల్లోనే కనిపిస్తుంది. ఇది అవిద్యావంతుల భాషలో జ్ఞ > గ్న మార్పును సూచిస్తుంది. ఉదా : ఆజ్జేయ (ఆగ్నేయకు బదులుగా) (SII 10.290.18-19,1577). గ్న్య కు బదులుగా జ్ఞ రాయటం కూడా కనిపిస్తుంది. ఉదా: అజ్ఞంమకుండ(అగ్న్యమ్మకుండకు బదులుగా) (NI 2 ఒంగోలు 82.20-21, 1668).