178 - తెలుగు భాషా చరిత్ర
1669), ధర్మం యెందు (/యందు) (NI 2 కందుకూరు 48.56, 1650). దేశ్య పదాల్లో చకారం తర్వాత కూడా అ, ఆ/ఎ, ఏ లు పర్యాయతను పొందుతాయి. ఉదా: చెరువు/చరువు (SII 10.755.13,1604/SII 10,766.10,1678). తెలుగులో తాలవ్య హల్లుల తరువాత ఎ,ఏ లు అ ,ఆ లుగా కనిపిస్తుండగా సంస్కృతాదానాల్లో అ,ఆ అను ఎ.ఏ లుగా రాయటం మాత్రమే కనిపిస్తుంది. ఈ సందర్భంలో సంస్కృతంలో హ్రస్వ ఎకారంలేదన్న విషయాన్ని గుర్తించాలి. ఆ కారణంవల్ల తాలవ్య హల్లులపైన అకారం తాలవ్యతను పొందుతుందని చెప్పవలసి ఉంటుంది. ఉదా : యెళము (SII 10.772.21,1696), (iii) వర్ణాల పర్యాయ ప్రవృత్తి (Phonemic free variation): లేఖన భేదం రెండు వర్జాల పర్యాయ ప్రవృత్తిని కూడా సూచించవచ్చు. (a) ఉ/అ: ఉదా: కనుక/కనక (SII 10.773.11,1697/SII 5.874.10,1620). కనకస్వర సమీకరణంవల్ల ఏర్పడ్డ ఆధునిక రూపం. (b) ఐ/అయ్; ఔ/ఆవ్: ఐ/అయ్; ఔ/అవ్ ల లేఖన భేదం ఈ రెండింటి వర్ణాశ్రిత పర్యాయ ప్రవృత్తిని సూచిస్తుంది. ఉదా: (ఐదు/)అయిదు(SII 7.655.10,1856). (c) ఎయ్య్/ఏయ్; ఉయ్య/ఊయ్: ఉదా: వెయ్యి (/వేయి) (SII 16.325. 2-8,1688), (నుయ్యి/) నూయి (SII 10.760.9,1668). (iv) పదాంశ విధేయ/వర్ణవిధేయ లేఖనం: రెండు పదాంశాలమధ్య సంధి ఫలితంగా మార్పు వచ్చినా పదాంశరూపాన్ని యథాతథంగా రాయటం పదాంశ విధేయ లేఖనం. ఉదా: పడ్లు/పళ్ల(కు) (NI 2 కందుకూరు 18.28,1408/SII 5.874.8, 1620). (v) ప్రాంతీయ, వర్గమాండలిక భేదాలు; (a) ట/ష; ఆధునిక కాలంలో కూడా కొన్ని బ్రాహ్మణ మాండలికాలలో అటు, ఇటు మొదలైన పదాలలో ష కారం వినిపిస్తుంది. ఉదా: యిషని(SII 16.312.31,1658), కలషువంట్టి (SII 6.79.10, 1796). (b) డ/ణ: కాండి/కాణి (SII 10.753.42,1500/SII 10.755.9,17వ శ.), (కట్టడము/)కట్టణము (SII 7.845.7,1782). (c) -అ/-ఎ: దేశ్య, తత్బవ, తత్సమ త్రయక్షర పదాల్లో మధ్యాచ్చు ఇకారం అయినస్పుడు చివరి అకారం ఎకారంగా కొన్ని మాండలికాలలో, ముఖ్యంగా దక్షిణ మాండలికంలో కనిపిస్తుంది. ఉదా :మాదిగ/మాదిగె (NI 2 కందుకూరి 48.65,1650/NI 2 నెల్లూరు 115.8-10,1635, (d) ఏ/ఈ; ఉదా: పోయీ (/పోయే) యందుకు (SII 10,753.51,1600). (vi) శైలీ మిశ్రణం: లేఖన భేదం శైలీ భేదాన్ని సూచించవచ్చు. ఇది మూడు రకాలుగా కనిపిస్తుంది. (1) ప్రాచీన/అర్వాచీన వర్జక్రమం :