176 తెలుగు భాషా చరిత్ర
యిచ్చి (SII 10.758.10.1658), (ఎనుబోతు/) యెనుబోతు (SII 10.753.57.1600), ఉండేది/వుండేది (SII 40.781.6, 17 వ.శ/SII 10.769.21, 1891), (ఊరు/) వూర్కి (017 2 కందుకూరు,20. 18,1640), (ఒడయలు/) వొడయలు (SII 10.755.2,1604). తాలవ్యాచ్చులకు ముందు, ఓష్ట్యాచ్చులకు ముందు క్రమంగా-యం-;-వ-లను లోపింపజేయడం కూడా లేఖనంలో కనిపిస్తుంది. ఉదా : అఇది (NI 3 రాపూర్ 49.14,1688), చెరుఉ (SII 7.557.8,1636). (b) వ, వా/వొ,వో ; వకారంవైన, నిమ్నాచ్చుకు ఓష్ట్యోచ్భారణ ఉంది. వర్ణవిధేయలగాను, ఉచ్చారణ విధేయంగాను లేఖన భేదం శాసనాల్లో కనిపిస్తుంది. ఉదా; వందురు/వొందురు (NI 1 CP 9.80, 1686/18.92,1541). _వోరు (వారుకు బదులు) (SII 16.254.10, 1562). పై లేఖన పర్యాయత ఉచ్చారణార్థం ఓ, ఓ లకు ముందు వకారం చేరిన చోట్ల కూడా కనిపిస్తుంది. ఒడయలు/వొడయలు/వడయలు (SII 10.748.90- 10, 1580/SII 10.745.4,1580/NI 8. ఒంగోలు. 182.9,1448). వారుగంటి (ఓరుగంటికి బదులుగా (SII 7.372.6.1459). (c) అ/ఒ: ఓష్ట్యాలకు ముందు నిమ్నాచ్చుకు ఓష్ట్యోచ్బారణ ఉండటంవల్ల ఈ భేదం కనిపిస్తుంది. ఉదా: తవ్వించి/తొవ్వించి (SII 7. 564. 6,1667),(NI 1 గూడూరు 88.4,1791). (d) ఎ/ఓ : ణ్డ కు ముందు వా మార్పుకారణంగా కావచ్చు ఈ లేఖనభేదం కనిపిస్తుంది. ఉదా: రెండు/రొండు (SII 4.280.29,15558 / SII 5.874,6,1620). (e) ఎ/ఏ (æ) : పూర్వం ఇయాంతాలుగా ఉండే శబ్దాలు 13/14 శతాబ్ధుల కాలానికే ఎకారాంతాలుగా మారాయి. (కందప్ప చెట్టి §1, 72-4) ఈపదాలను శాసనాలలో భిన్న పద్ధతులలో రాయటం జరిగింది. అంటే-య,-ఎ,-అ లతో ఈ పదాలను రాయటం కనిపిస్తుంది. ఈ లేఖన భేదం 15 వ శతాబ్దినించే అన్ని ప్రాంతాలలోను (§ 5,7), ముఖ్యంగా ఒకే శాసనంలో కూడ కనిపిస్తుంది. దీనివల్ల ఇది ఒకే ఉచ్చారణను అంటే విసృత ఎ (æ) కారాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. ఉదా : పళ్యాలు/పళ్ళెం/పళ్ళం/పళాలు (SII 4.981.6, 1518). ఎ,ఏల వివృతోచ్చారణను సూచించటానికి యకార చిహ్నాన్ని వాడటం ఈ కాలపు శాసనాల్లో కవిపిస్తుంది. ఉదా: మ్యేరకు (NI 8 రాపూరు 30.8, 1688). (f) మ్య/వ : ఇక్కడ వకారం అనునాసిక వకారానికి చిహ్నం కావచ్చు. ఉదా: (మామిడి/) మావిడి(SII 5.1228.7,1508/, NI 2 కందుకూరు 46.37,_ 1682). (g) స/శ: తాలవ్యాచ్చులకు ముందు సకారానికి శకారోచ్బారణ