శాసన భాషా పరిణామం 175
అర్దానుసారంగా గుర్తించవలసి ఉంటుంది. ఉదా : అంగ్గడి (SII 5.674.14,1620), పుండ్డె (SII 7.790. 5.1714), వె౦క్కట (SII 7.558.18, 1856). చారిత్రక దశలో అర్ధానుస్వారం పూర్వాచ్చు అనునాసిక్యతకు చిహ్నం అయి ఉంటుంది. అది ఈ యుగంలో తన విలువను పూర్తిగా కోల్పోయిందని చెప్పటానికి చారిత్రకంగా అనుస్వారంఉండి ఆనుస్వార చిహ్నంలేకుండా రాసిన కొన్ని రూపాలే నిదర్శనం. ఉదా : తోపు (<తోంపు) (SII 10.763. 6,1670), నాడు (<నాండు) (SII 5.1221.3, 1809).
6.6. ద్విరుక్త స్పర్శాలకు బదులుగా మహా ప్రాణస్పర్శాన్ని రాయటం ఈ యగంలో కనిపిస్తుంది. ఉదా: లేఖ (=లెక్క) (SII 10.757.28,1650, మఖ (=ముక్కా) (NI 2 కందుకూరు 44.88,1650). ఇది 15,16 శతాబ్దుల్లోకూడా కనిపిస్తుంది. ఉదా: ఇధరి ( = ఇద్దరి) (SII 6.884.9,1408). (SII 16.257.48.1568), బొభిలి (= బొబ్బిలి) (SII 6.798. 8, 1425). ఇంతకుముందు సంస్కృతాదానాల్లోకూడా ఈ అలవాటు కనిపిస్తుంది. ఉదా: సుధ ( =శుద్ద) (SII 5.1194.3,1455), ప్రఛన్న (=ప్రచ్ఛన్న) (రా. వా. 1938.107.20.16 వ శ). దీన్ని బట్టి సంస్కృతాదానాల్లోని ద్విరుక్త మహప్రాణాలు ద్విరక్త అల్పప్రాణాలుగా ఉచ్చరింపబడేవనీ, కాని అద్విరుక్త మహ్మాప్రాణాలుగా రాయబడేవనీ, ఉచ్చారణలోమాత్రం అవి ద్విరుక్త అల్బప్రాణాలేననీ, తత్ఫలితంగా తెలుగులోని ద్విఋక్త అల్పప్రాణ స్పర్శాలను కూడా అద్విరుక్త మహాప్రాణాలుగా రాసేవారనీ ఊహంచవచ్చు.
6.7. ద్విరుక్త, సంయుక్త అనునాసికాలకు, అనునాసికం + య సంయుక్తాలకూ ముందు అనుస్వార చిహ్నం కనిపిస్తుంది. బహుశా అది వూర్వాచ్చు అనునాసిక్యతకు చిహ్నం కావచ్చు. ఉదా. తింమ్మాబట్లు (SII 10.775.7,17 వ.శ.), జంన్మాలు (NI 2 కందుకూరు 48.89, 1650), సోంమ్య, (SII 10.761.1,1669).
6.8. లేఖనభేదం : లేఖన భేదానికి ఏడు రకాల కారణాలను పేర్కొనవచ్చు. (1) ఉచ్చారణ భేదం (Phonemic and Sub-Phonemic variation): (a) పదాదిలో తాలవ్యాచ్చులకు, ఓష్ట్యాచ్చులకు వరుసగా యకార పూర్వక తాలవ్యాచ్చులకు, వకార పూర్వక ఓష్ట్యాచ్చులకు భేదకత్వం లేదు. ఉదా : (ఇచ్చి/)