Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషాపరిణామం 163

పురుషవచన ప్రత్యయం అని మూడు విభాగాల్తున్నాయి. ఉదా. వచ్ + ఇ + రి > వచ్చిరి, వచ్ + ఎ + న > వచ్చెను. మొ.వి.

5.48. సామాన్య సమాపకక్రియలు (అ) భూతకాలం : పురుషబోధక ప్రత్యయవిషయంలో పూర్వయుగానికీ ఈ యుగానికీ తేడా లేదు. కాలబోధక ప్రత్యయవిషయంలోనూ అట్లే తేడా కనిపించదు. కాని తాలవ్యహల్లుల తర్వాత ఎ > అ మార్పు ఈ యగరలో సృష్టంగా కనిపించటంచేత క్రియలలోను ఇది తరుచుగా కనిపిస్తుంది.

సమర్చించను ( < సమర్చించెను) (SII 5.1228. 0 1508), సమర్పణ చేశను (చేసెను) (పై. 6 1078.12,1402), గుడి కట్టించను. (కట్టించెను) (పై 10.584.5 , 1436) మొ.వి, ఉత్తమ మధ్యపురుషల్లో - ఇతి కాలబోదక ప్రత్యయం. కాని ద్విత్వచకారం, యకారం, సకారంగా మారి - ఇతిలోని -ఇలోపిస్తుంది. ఉదా: ఇస్తిమి (SII 4.800.20,1513), సమర్పింస్తిమి (పై. 4.981.5,1518), ఇస్తిరి ( పై. 10.784.12.1574). ఇస్తిని ( పై. 10747.11,1574), చేస్తిమి ( పై. 5.48.19,145౦) మొ.వి.

(ఆ) వర్తమానభవిష్యత్తు : వర్తమానభవిష్యత్ప్రత్యయం ప్రథమైకవచనంలో -ఎడి-/-ఎడు-, తక్కినచోట్ల -ఎద-అని పూర్వయుగంలో చర్చింపబడింది. ఈ -ఎద- ప్రత్యయం -ఏ-గా మారి నేడు తమిళనాడులో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల వ్యవహారంలో ఉంది. ఈ ప్రత్యయం ఈ యుగంలో క్వాచిత్కంగా కనిపిస్తు౦ది. మీరు భీమేశ్వరుని ఊలిగము సేసేరుగాన (SII 4.1375.23, 1444), పాదాలు మా సిరన్సున ధరించేము. (పై. 6,248.58, 1515). ఇస్తేరు (ఇచ్చేరు) (పై 10.748.26:1580) మొ.వి.

(ఇ) భవిష్యత్తద్ధర్మం : ఈ భవిష్యత్తద్ధర్మ౦ విషయంలో పూర్వయుగానికీ ఈయుగానికీ చెప్పుకోదగ్గ మార్పులు లేవు.

5.49 నంశ్లిష్టరూపాలు : ఈ సంశ్లిష్టరూపాలు క్రియాజన్యవిశేషణాలకు వాడు, వారు, అది, అవి అను సర్వనామాలు చేర్చగా ఏర్పడతాయి. ఈ రూపాలకు ఉత్త్యమపురుషల్లో పురుషవచన ప్రత్యయాలు చేరుతాయి. వచ్చువారము, వచ్చినవాడను మొ.వి. పై సామాన్య సమాపకక్రియలకు ఈ సంశ్లిష్టసమాపక క్రియ