162 తెలుగు భాషా చరిత్ర
తారు పాలింపిదేశాలం (పై. 6.1168.1234) సింహాచలం-విశాఖ
సమర్పింపి (పై. 6.1098.8,1402)
సమర్పింపెను (పై 6.1071.4,1402)
సమర్చింపిన మోదాలు (పై. 6.1248.28,1471) శ్రీకూర్మం-శ్రీకాకుళం.
మిగిలీన ప్రాంతాల్లో సమర్చించెను వంటి రూపాలే కనిపిస్తాయి.
తాలవ్యంకాని అచ్చుతో ప్రారంభమయ్యే ప్రత్యయాలు పరమైనప్పుడు చు > పు మార్పులేకపోవడం ఈ యుగంలో తరచుగా కనివిస్తుంది. ప్రాతిపాలించక (SII 5.37.41,1494), అనుభవింంచుమని (పై. 4.800. 22,1513), పాలించ నవధరించిన (పై. 4.709 25,1658), పాలించగా (పై. 1.986.18,1581) మొ.వి.
5.44. పరిమాణార్థకమైన కొలుచు ధాతువు అన్నంతమై-కల చేరేటప్పుడు చకరానికి యకారమవడం 15వ వ శతాబ్దిలో విశాఖ-శ్రీకాకుళం ప్రాంతలో మాత్రం కనిపిస్తుంది. తెచ్చి కొలయంగలవాడు (SII 6.1184, 1408), శ్రీకూర్మం కొాలాయంగలారు (పై. 6.817.17, 1408) సింహాచలం, తెచ్చి కొలయంగలా౦డు (పై. 6.711, 1409) సింహాచలం, నె; తు.7 కొలాయంగలాండు, (పై. 6. 850.10, 1418) సింహాచలం మొ.వి.
5.45. పూర్వయగంలో కనిపించిన ఇస్తిమి సమర్పిస్తిమి, చేస్తిమి వంటి రూపాలు ఈ యుగంలో స్థిరపడ్డాయి. అయినా ఇచ్చితిమి, సమర్పించితిమి వంటి రూపాలు చాలా క్వాచిత్క౦గా కనిపిస్తాయి. సమర్పించితిమి (SII 6.825.10, 1416) మొ.వి.
5.45. ఈ యుగంలో వెలయు ధాతువుకు వైలసును అనే తద్ధర్మార్థక్మక్రియ (SII 10.584.6, 1436; 6.655.6 1436) కనిపిస్తుంది. కొలుచు, చేయు ప్రాతిపదికలు విశేషణమైనప్పుడు కొలును, చేను అవుతుంది. కొలునువాండు (పై. 6,887. 17,1425), చేసువాండు. (పై. 5.1162.13, 1427). చేసువారు (పై. 5.1250.10 ,1451) మొ.వి.
సమాపక క్రియలు
5.47. సమాపకక్రియలు రెండు రకాలు (1) సామాన్య సమాపకక్రియలు (2) సంశ్లిష్టసమాపకక్రియలు. వచ్చినవాడు > వచ్చినాడు వంటివి సంశ్లిష్ట సమాపకక్రియలు. సామావ్యసమాపక క్రియలలో ప్రాతిపదిక + కాలబోధక ప్రత్యయం +