పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

158 తెలుగు భాషా చరిత్ర

ఖండికలతోటి మరియాదా (SII 3.1168.32, 1434 ), మణీకలా తోటి సమస్య (పై. 6.1098.17,1402) మొ. వి.

5.31. చతుర్ధీ విభక్తి : కొఱకు ప్రత్యయం పూర్వయుగంలో చాలా క్వాచిత్కంగా కనిపించింది. కాని ఈ యుగంలో చాలా తరచుగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడూ గుణవాచకాలపైనా, క్రియావాచకాల పైనా కనిపిస్తుంది. ఆయష్యాభివృద్ధి కొఱకుంన్ను (SII 5.1158,8. 1471), అక్షయఫలంకొఱకు (పై. 5,1228.10,1503), గుగ్గిలము వెట్టికొఱకై (పై. 5.129.4,1422), వెలింగిడి కొఱకై (పై.5.1184.42,1480) మొ.వి.

5.32. పంచమీవిభక్తి : చేతన్‌, వలనన్‌లు పూర్వయుగంలో లాగానే గ్రహ్యార్థంలో వస్తాయి. చేత ప్రత్యయం సాధారణంగా మానవాచకాల మీదను, -వలన ప్రత్యయం క్లీబవాచకాలమీదనూ వస్తాయి. సూరాజోస్యులచేతను సదాశివుని చేతను క్రయలబ్ధమైన (SII 5.48, 12,1450), స్తానమువారి చేతంగొన్న (పై.5.149.8,1402) మొ.వి. కోరివల్న యెన్ని దశములకు వచ్చును (పై. 10.747.12,1574) మొ.వి. -నుండి, -దనుక గమనార్థంలో వస్తాయి. వుంపున నుండి వ్యాయవ్యానకు (NI 8 ఒంగోలు 71.48.1517), కొండవీటి దనకాను. విరుగంబొడిచి (తి. తి. దే. శా. 8,68,1514), మొ.వి. నుండి శబ్దం వల్లకు పరమై కూడా వస్తుంది. ఏలానది వల్లనుండి (SII 5.3781, 1491) -లోను నుండి అని కూడా కనిపిస్తుంది. భూమిలోననుండి (పై. 4.889.228, 1518).

షష్టి, సప్తమీ విభక్తుల విషయంలో విశేషాలేమీ లేవు.

సంఖ్యావాచకాలు

5.33. ఒకటి : గతయుగంలో ఒకండు, ఒకటి రెండు రూపాలూ పర్యాయంగా కనిపిస్తూ 14వ శతాబ్దిలో ఒకటి శబ్దమే బహుళంగా ఉన్నట్టు చూశా౦. ఈ యుగంలో ఒకటి శబ్దం స్థిరమైపోయినట్టు చెప్పవచ్చు. ఒకండు శబ్దం తూ.గో-విశాఖ ప్రాంతంలో మాత్రం క్వాచిత్క్మంగా కనిపిస్తుంది. ఒకడు (SII 6.825.9, 1416, 6,1045.5, 1405) సింహాచలం, విశాఖ; ఇరువయ్యొకండు మోదాలు (పై. 4.1378.10, 1416) దాక్షారామం, తూ. గోదావరి.