పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

156 తెలుగు భాషా చరిత్ర

చేరుతాయి. చక్రవర్తులు (SII 6.667.17, 422), దేవులు (పై. 5.34.11, 1484), సంబ్యాళు (పై. 6.709.18,1426) మొ.వి.

గతయుగంలో లాగానే -గారు, -వారు ప్రత్యయాలు కూడా విరివిగా కని పిస్తాయి. పాతృలంగారు (SII 6.219.15,1494), పంచాననవారు. (పై. 6.219, 19,1494), పోతినేనింగారు (పై.6.242 10,1427). అమ్మవారు (పై. 6.248. 36,1515) మొ. వి. -రు అంతమందున్న బహువచనరూపాలకు తరచుగా మరో బహువచన ప్రత్యయమైన -లు చేరుతుంది, అమంగారులు (పై.10 587. 45,1410), అమ్మంగారులు (పై 10 577.10,1410) మొ.వి.

5.28. ఔషవిభక్తికరూపాలు : మహద్వాచక రూపాల్లో _డు లోపించి -ని చేరిగాని, చేరకగాని విభక్తి ప్రత్యయాలు చేరడం కావ్యభాషలో సహజం. కాని, -డు లోపించకుండానే -ఉ చేరిన రూపాలకు విభక్తి ప్రత్యయాలు చేరిన రూపాల్ని పూర్వయుగంలోనే కొన్నింటిని చూశా౦. అట్టివి ఈ యుగంలో మరికొంత ప్రచు రంగా కనిపిస్తున్నాయి. శ్రీకూర్మనాథుడి సంముఖమందు (SII 5.1172.9, 1427), ఓభళబోయడి గోచరానను (పై. 5 1162.11,1427), దేవుడికి (NI 3 పొదిలి 19.10.1689). బ్రాహ్మణి జంపిన దోషానం (>బ్రాహ్మడిని) (SII 10. 745.61,1530), బ్రంహ్మేశ్వరుంణ్ని (పై. 10.749.10, 1588); పాపవి నాశరేశ్వరుంణ్ని (పై. 10.749.10,1583), గోపీ నాధుండ్ని (పై. 10.749. 39,1589), చన్నకేశ్వరరాయన్ని ప్రతిష్టసేయించి (రాయణ్జి > రాయన్ని. (NI 3, రాపూరు 41.18, 1585)

బహువచన ప్రత్యయం తర్వాత -అ అనే ఔపవిభక్తికప్రత్యయం చేరేట్టు పూర్వయుగంలోనే చూశా౦, ఈ యుగంలో తరచుగా కనిపించే -ళు రూపం పైన కూడా దీన్ని చూడవచ్చు. తమ్మి సంబ్యాళచేత (SII 6,710.8,1409) మొ వి. మిగిలినవాటి విషయంలో గతయుగానికి ఈ యుగానికీ తేడా అట్టె కనిపించదు. -టితో అంతముయ్యే ఔపవిభక్తిక రూపాలకు బదులు -ఇంటి చేరడం పూర్వయు గంలోనే కనిపించింది. ఈ యుగంలోనూ అట్టివి తరచుగా కనిపిస్తాయి. పగలు- పగలింటి (పై. 6.737.7,1465) మొ. వి.

5.29. ద్వితియావిభక్తి : నామపదాలు అలాగే మార్పు లేకుండా ప్రథమా రూపాలుగా వస్తాయి. ద్వితీయారూపాల విషయంలో అట్టే విశేషాలు లేవు. కాని