Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

154 తెలుగు భాషా చరిత్ర

నామవదాలు

5.24. ఈ యుగపు కృత్తద్ధితాంతాల విషయంలో అట్టె విశేషాలు లేవు. కాని ఎరువుమాటల విషయంలో ఈ యుగంలో ఒక నూత్నదశ అవతరించింది. అంటే ముస్లిం రాజ్యాలు ఈ యుగంనాటికి స్థిరపట్టంచేత దక్కనీ ఉర్దూనుంచి అనేక పదాలు ఈ యుగంలో తెలుగులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ఉదాహరణలు : మహం (మాసం), (SII 10.758.5. 1580),సులతాని (పై. 10.748. 6,1580), దరివేనులు (సాధువులు) (పై. 10.748.15, 1580), ఠాణేదార్ (పై.10.745.12, 1587), హవాలాదారు. (సైన్యాధిపతి) (పై. 10.748.2,1577), సహాయబు(పై 10.748.28, 1577), హజరతి(గౌరవనీయలు) (పై. 10.751.9, 1598), నామజాదు (పై. 10.751.10,1598), ఖబురు (పై. 10.751.28,1598), మక్తా (పై. 4.711.29,1598), నఫరు (పై. 4.711.26,1598) మొ.వి. ఇవిగాక ప్రాకృత భాషనుండి వచ్చిన దఇబడలు (దధివడలు) (పై. 6.1040. 6,1417) మొ.వి. ఈ యుగంలోని వింత ప్రయోగాలు.

5.25. సమాసం: సమాసాల విషయంలోనూ ఈ యుగంలో చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. చాలావరకు పూర్వయుగంలో లాగానే ఉంటాయి. వూర్వయుగంలో కనిపించిన తిరువజాము మొదలయిన రూపాలు ఈయుగంలో క్వాచిత్కంగా కనిపిస్తాయి. తిరవజాన (SII 8.1107.5,1414), తిరుమజామ (పై. 6.1085,7, 1428) మొ. వి. ఇలుపట్టు మొదలై న రూపాలుకనిపిస్తాయి. (పై. 5.14. 9,1410), గతయుగంలో నీరినేల, నీరునేల అని రెండు రూపాలు కనిపిస్తాయి. కాని ఈ యుగంలో నీరునేల రూపం మాత్రం కనిపిస్తుంది. అన్నందమ్ములు (పై. 6.1184. 14,1408). ఇది బహుశా ఊరుంగాయెలు (పై. 5.981.7, 1518) మొదలయిన సమాసరూపాల సామ్యంవల్ల ఏర్పడి ఉండవచ్చు. మాతాపితాళ్ళు (పై. 6.219.25, 1494), తల్లిద౦డ్రాదులకు (పై. 5.87.85,1494) వంటి ద్వంద్వస మాసరూపాలు ఈ యుగంలో క్వాచిత్కంగా కనిపిస్తాయి. ఇందు మాతా పితాళ్ళ రూపం ఎక్కువసార్లు కనిపిస్తుంది.

5.26. లింగ ప్రత్యయాలు : మహత్తులో-న్హు ఈయుగంలో.. బొత్తుగా కనిపించదు. -౦డ్రు. -డు అన్ని మాండలికాల్లోనూ స్థిరపడినట్లే. ఈ-ంతు ప్రత్యయందఖనీ ఎరువు మాటల్లోనూ చేరుతుంది. ఉద్దండభానుండు (SII 6,248.22.