Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

153

పతినే ఊరి (57 5.102,8,1449). ఇక్కడ జరిగింది వర్ణవ్యత్యయం వల్హ అనిధ చెప్పటంకన్నా అనన్‌ > నాన్‌, అనపుడు > నావుడు సామ్యంతో అనే > నే అని ఏర్పడిందని చెప్పవచ్చు.

  5.22. డ్ల సంయుక్తరూపం ళ్లగా మారడం పూర్వయుగంలో చాలాతీవ్రంగా జరిగింది. ఈ యుగంలో డ్ల రూపం దాదాపు ళగా మారిపోయిందనవచ్చు. మామీళు౦మ్న, మారేళు౦న్ను, నేరేళు౦న్ను (SII 10,787.44,1526),  దేవుళు (పై. 6.694.3,1516), నీళు (పై. 6.699.7,1535), (నంబ్యాళు) (పై. 6.709.13, 1416), మాళు (మాడలు) (పై. 6.731.1406) మొ.వి. (ళ్ళ > ళ కావడానికి 5.19. చూడండి). ఇలా డ్ల > ళ్ల పూర్వయుగంలోనే దాదాపు పూర్తికావడంచేత ఈ యుగంలో కొత్తగా సంధిగతమైన డ్ల రూపాలేర్పడటం లేదు. అంటే ల్‌ + ల > డ్ల, ర్‌ + ల > డ్ల వంటి మార్పులు జరగటంలేదు అని చెప్పాలి. తూర్చు పడమర్లు (SII 4.789. 227, 4518), దేవర్లకున్ను (పై.10 677.48,1410), హరాంభోర్లు (పై 10.751.19,1598) మొ.వి. డ్ల తోడి రూపాలు ఈయుగంలో చాలా  క్వాచిత్క౦గా కనిపిస్తున్నాయి. గుడ్లు కట్టించి (పై. 10,749.16,1583) మొ వి.

సంధి

5.23. సంధివిషయంలో పూర్వయుగంలో లాగానే ఈ యుగంలోనూ ఏ నియమం లేకుండా రెండచ్చుల మధ్య యడాగమం రావచ్చు, రాకపోవచ్చు. లేదా సంధి జరగవచ్చు. అముదులు నాలుగు యింతవట్టు (SII 5 5.8,1404), విచ్చేశి వుదయగిరి (పై. 6.248.12, 1515); పఱచూరను వూరగరణము (పై. 10. 586 7,1448), కొలుపు ఒకటి (పై 6.710.6,1409), కాంచనం గారజునుండు (గారిఅనుజుండు), (తె.శా. 1.178.5,1482) మొ.వి. గసడదవాదేశ సంధి పూర్వయుగంలో లాగానే జరిగినా జరగవచ్చు, జరక్కపోయినా పోవచ్చు. ఘడియారము పెట్టి (SII 5.10.5,1404), పందు మేశిసేనున్ను (పై. 5 26.7,1412). ద్రుతము మీది కచటతపలు గజడదబలు కొనిచోట్లు చాలా ఉన్నాయి. ఉదా : అప్పములకు బియ్యంను తిరుబోనములో పవుపెసలును పిండివంటకు (పై.5.5.4,1404) మొ.వి.