Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రకరణం 5

శాసనభాషా పరిణామం

(క్రీ. శ. 1400 - 1599)

_ఎం. కందప్పశెట్టి

5.0. తెలుగుశాసనాలు గతయగంలో దాదాపు రెండువేలుండగా, ఈ యుగంలో అవి ఇంచుమించు మూడు వందలే ఉన్నాయి. ఇలా శాసనాలసంఖ్య తగ్గిపోవడమే కాక అనేక శతాబ్దాలుగా తెలుగుభాషను రాజకీయ, మత, సాంఘిక విషయాల్లో చాలా విరివిగా వాడడంచేత తెలుగుభాషాలేఖనపద్ధతిలో కొన్ని కొన్ని సా౦ప్రదాయాలేర్పడ్డాయి. ఉదా : పెట్టినవి అనడానికి పెట్నవి (SII 5.24.7,1401) అనీ పెట్టిన అనడానికి పెట్న (పై.5.26.4, 1412) అనీ సర్ప వరం శాసనాల్లో చాలా తరచుగా కనిపిస్తాయి. ఇట్టివి పూర్వయుగంలోనూ క్వాచి త్కంగా కనిపిస్తాయి. ఇలా వ్రాసి ఉండటంచేత ఈవిధంగానే ఆ రోజుల్లో ఉచ్చ రించే వారని చెప్పలేం. ఎందుకంటే నేడూ గ్రామాల్లోని కొందరు సా౦ప్రదాయక లేఖకులు 'తమ' అని ఉచ్చరిస్తూనే “త్మ' అని వ్రాయడం చూస్తూన్నాం. కాబట్టి "పెట్నవి" మొదలైనవి సాంప్రదాయక రచనలే కాని ఆలా ఆనాడు ఉచ్చరించేవారని చెప్పలేం.

ఇలాంటి సా౦ప్రదాయాలవల్ల భాషలో ఉచ్బారణలు మారినా లేఖనాపద్ధతి మారక పోవచ్చు. అతి ప్రాచీనశాసనాల్లోనే శకటరేఫకు సాధుకరేఫ వ్రాయడం ప్రారంభం అయినా సాధురేఫ శకటరేఫల చిహ్నాలు 20 వ శతాబ్దిదాకా వాడుకలో ఉండటం మనకు తెలిసిందేకదా ! ఇలా కొన్ని సా౦ప్రదాయక రచనలున్నా ఈయుగపు శాసనాలు కూడా గతయగపు శాసనాల్లాగానే కొన్ని కొన్ని ముఖ్యమైన చారిత్రక అంశాల్ని తెలుసుకోడానికి ఉపయోగిస్తాయి.

5.1. వర్ణాలు: వర్ణాల విషయంగా ఇంతకు పూర్వయుగానికీ, ఈ యుగానికి అట్టే తేడా కనిపించదు. కాబట్టి దీనికి వేరే ప్రత్యేకమైన వర్ణాల పట్టిక