శాసన భాషా పరిణామం 133.
(గ) మూవురు (పై 6.625.15, 1158), ముగురు ( పై.6.1084.14, 1321).
(ఘ) నల్వురు (పై. 4.1020. 9, 1118), నల్గురు (పై. 4.1067.8, 1153).
(చ) ఏవురు (పై.4.1191.7,1128). ఐగురు (పై.6.1117.8,1378)
(ఛ) అఱు, ఏడు ప్రయోగాలు లేవు.
(జ) ఎన్న౦డ్రు (పై.4.1305.11,1107), ఎనుమంఱు (పై.6.1052.10, 1850). తొమ్మండ్రు (పై.6.87.11,1164), ఇర్వండ్రు (పై. 5.1188.64, 1250) మొ. వి.
4.49. సర్వనామాలు : సర్వనామాల్లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ ఈ యగపు శాసనాల్లో కనిపించవు. కనిపించినవాటిని ఈకింద ఇస్తున్నాను. ఏను ( తె.శా. 1.150.20, 1170), ఏము (SII 4.1186.3, 1153), నేను, మేము మొ. ప్రయోగాలులేవు. మధ్యమపురుష సర్వనామాలు శాసనాల్లో కనిపించవు. 'తాను' శబ్దానికి బహువచన రూపం 'తారు' మాత్రం శాసనాల్లో కనిపిస్తుంది. 'తారు' ( EI. 5.147.139, 1213 ) మొ. కాని 'తాము' కనిపించదు. నన్నయ నన్నె చోడులు కూడా 'తారు' రూపాన్నే ప్రయోగించి ఉన్నారు. కాన తాము > తారు మార్పు ఈయుగానికి పూర్వం ఎప్పుడో జరిగి ఉండాలి.
4.50. క్రియాపదాలు : క్రియాప్రాతిపదికలు రెండు రకాలు, 1. అవి భాజ్యం (Simple), 2. విభాజ్యం అని. అగు (SII 4.672.7, 1139 ), అమ్ము (పై.6.637.2.1147) మొ. అవిభాజ్యాలు. విభాజ్యాలు (అ) ఏకధాతుకం (ఆ) బహుధాతుకం అని రెండు రకాలు.
4.51 ఏకధాతుక విభాజ్యాలు : (Complex)
(అ) ధాతువుకు _ఇంచు చేర్చటంవల్ల ఏర్పడేవి. ఉదయించు (SII 4.1061.2, 1149), వర్థించు (NI 2.28 A 18,1166). సరించు (SII.10.83.19, 1125) మొ. వి. సంస్కృత పదాలన్నీ కూడా సాధారణంగా ఇలాగే అవుతాయి. (హ)అహ-తర్వాత ఇంచు