పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

132

తెలుగు భాషా చరిత్ర

ఇట్టి సంఖ్యలకు ఏను చేరేటప్పుడు ఒక-వింతసంధి కార్యం 12, 13 వ శతాబ్దుల్లో కనిపిస్తుంది. ఇరువదేను ( SII 6.085.6, 1287), డెబ్బదేను (పై. 6.1143.18,1269) మొ.వి. ఇందు 'ద'కారం 'డ'కారం కావడం విశేషం- 14వ శతాబ్దిలో 'ద'కారం 'య'కారం కావడం దాదాపు పూర్తి అయిందనవచ్చు. కాబట్టి ఈ శతాబ్దిలో ఇరువదేను వంటి రూపాలు కనిపించటంలేదు. ఇరువై యేను వంటి రూపాలే కనిపిస్తాయి.

(12) నూరుపై గుణింతపు సంఖ్యలు ఇన్నూఱు మొ.వి. : ఇన్నూఱు (SII 10.547.4.1332) , మున్నూఱు (పై. 10.304.8, 1245), నన్నూఱు ( పై. 6.1167.8.1220) , ఏనూఱు ( పై, 5.1046. 13,1187) మొ. వి. తర్వాతి నూర్లసంఖ్యలు శాసనాల్లో కనిపించటం లేదు.

(13) పై ఇరువది మొ. సంఖ్యా రూపాల్లో లాగానే ఇరు- మొ. రూపాలు. సమాసాల్లోనూ కనిపిస్తాయి. 1.ఇరువుట్టి (SII 5.1016.13,1134), ముయ్యద్ద ( పై. 10.118.25.1146), నలుతుము (పై. 10.408. 115,1266 ), పందుము (పై. 10.710.19,1178 ), ఎనిమిది శబ్దానికి మాత్రం ఎనుబం లేక ఎనుమల రూపాలు కనిపిస్తాయి. ఎనుబందుము ( SII 10.422.9,1318 ), ఎనమందుము ( పై- 6.835.8, 1391) మొ. వి, ఇంకా ఈ కిందివి గమనార్హం. పందుము (పై 5.1364.18.1121), పనిద్దుము (పై 10.557.32, 1373), పదేందుము(పై.5.159.6,1277)మొ. వి, పై సమాసాల్లో బహువచన ప్రత్యయం లోపించి ఉండటం గమనించవచ్చు. బహువచనం తోడి రూపొలూ క్వాచిత్కంగా కనిపిస్తాయి. నలుమూడ్లు (నాల్గు మూరలు) (SII 6.1136,13,1374) మొ. వి.

(14) మహన్మహతీ సంక్యావాచకాలు :

(క) ఒకడు (NI 3.14.77,1245), ఒకరు (SII 6.839. 23,1365), ఒకరుడు (పై. 6,1136.24,1250).

(ఖ) ఇద్దఱు(SII 6.941 941.12,1299), ఇద్దఱు ( పై. 6.667,16,1182).