పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

131

(11) పది పై గుణి౦తపు సంఖ్యలు. ఇరువది మొ.వి. ఇట్టి సంఖ్యావాచకాలు ఈకింద ఇచ్చిన రూపాలపై పది చేర్చగా ఏర్పడుతాయి, ఇరు-(రెండు), మూ-(మూడు), నలు- (నాలుగు), ఏన్‌-/ఎన్‌- (ఐదు), అఱు - (ఆఱు), డె-(ఏడు), ఎన-(ఎనిమిది), తొన్‌ -(తామ్మిది). ఈ రూపాల్లో పది చేరేటప్పుడు ఈ కింది సంధిమార్పులు వస్తాయి.

1. మొదటిరూపంలోని చివరి ఉకారం పాక్షికంగా లోపిస్తుంది. ఇరు-పది > ఇరువది, ఇర్వది.

2. (హ) అ (హ1) ఆ : లో హ1 రేఫ అయితే తర్వాత 'ప'కారం 'వ'కార మవుతుంది. ఇర్వది, 'హ1' "ల"కారమయితే 'ప'కారం పాక్షికంగా 'వ'కారమవుతుంది. నలుపది, నలువది.

3. 'న'కారం తర్వాతను, 'ఉ'కారం కాక తక్కిన అచ్చుల తర్వాతను 'ప'కారం 'బ'కార మవుతుంది. దీనిముందు 'న'కారం ఆనుస్వారం అవుతుంది. ఏంబది, ఎనబడి, తొంబది.

4. హఅ లేక హఆ తర్వాత 'ప'కారం ద్విత్వమయి పూర్వ దీర్ఘం లోపిస్తుంది. ముప్పది. 3 వ సూత్రం ప్రకారం-డెబ్బది.

5. శాసనభాషలో పది శబ్దంలోని ప్రథమహల్లు పాక్షికంగా మహాప్రాణమవుతుంది, ముప్పది మొ. వి.

6. పదిశబ్దంలోని 'ప' కారం పాక్షికంగా 'య'కారం అవుతుంది. ముప్పయి, ముప్పై మొ.వి. ఉదా. ఇరువది (SII 5.1084,6, 1118 ), ఇర్వయి ( పై. 5.1188.64 1250 ), ముప్పది (పై. 10.654.8, 1152), ముప్పై (పై. 6.936.7, 1280), నలుపది (పై. 6.598.11.1163), నల్వది ( పై. 6.597.8,1238) నల్ఫయి (పై. 5.1188.52, 1250), ఏంబది (పై 6,211.26, 1170), -ఎంబై (పై. 6.928.8,1291), అఱువది (పై .10.177,78.1171), అఱువై (పై. 6.812.5,1390), డెబ్బది ( పై. 5.1018.2,1148), ఎనబై (పై. 6.1035.15, 1394), తొంభయి. (పై. 5.1188.16 1250) మొ. వి. పై శబ్దాల్లో ఇరువది మొ. దకారాంతపదాలు 12వ శతాబ్దిలో క్వాచిత్క౦గా కనిపిస్తూ రానురాను ఎక్కువవుతాయి.