పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

126 తెలుగు భాషా చరిత్ర

ఉకారాంత పదాల్లో కూడా -కు ప్రత్యయం తరచుగా కనిపిస్తుంది. దీపముకు (SII 5.1043.8, 1123 ) మొ.వి. ఈ చతుర్థీ విభక్తికి తరచుగా అగు క్త్వార్ధక రూపమైన -౦ అన్నంత రూపమైన -కాన్‌ చేరడం కనిపిస్తుంది. భోగాలకై (SII 10.480.19, 1296), . పెట్టింపులకుంగా. (పై. 4.1098.8, 1153 ), మొ. వి, నిమిత్తార్థంలో -కాన్‌ మాత్రం రావడం కూడా కనిపిస్తుంది. రాజ్య రాష్ట్ర గామ వర్థనగా... పెట్టిన (పై. 10.710.8, 1178) మొ. వి.

-కొఱకు ప్రత్యయం 14 వ శతాబ్దిలో రెండుచోట్ల మాత్రం కనిపిస్తుంది. అభీష్ట సిద్ధికొఱకు (SII. 6.789.7, 1381).చేయించి కొఱకై (పై. 6.1096. 4, 1383).

4.44. వంచమీ విభక్తి : (క) -చేతన్, -చేన్‌, -వలనన్‌, రూపాంతరం : (వల్నన్‌ , వల్లన్‌) (ఖ) -నుండి. (గ) -కంటెన్‌,

(క) -చేతన్‌, చేన్, -వలనన్‌ : ఇవి గ్రహ్యర్థంలోనే ప్రయోగంలో కని పిస్తాయి. వీటిలో -చేతన్‌, - చేన్‌ మహన్మహతీ పదాల తర్వాతను, వలనన్‌. క్లీబ పదాల తర్వాతిను వస్తాయి. స్తానపతుల చేతవిల్చి (SII 6.600.8, 1165 ), దేవరచే కృపంగొని (పై.6.1142. 28, 1268), జీతాలవలనం... (NI 2.43.10, 1340), తనవ్రిత్తి వల్న నిచ్చిన (SII 10.422.28, 1269 ), సుంఖంవల్లను (పై 10.480.19, 1296). ఒక్కచోటమాత్రం -చేత ప్రత్యయం క్లీబ సమంపైన కనిపిస్తుంది. మగతల సమస్తంఐన పరివారము చేతను (తె.శా. 2.128.28, 1297), _వలనన్‌ ప్రత్యయం క్వాచి త్కంగా మహన్మహతీ పదాల పైననూ వస్తుంది, వైష్ణవ నాయకుల వవల్లను ( SII 6.904,25, 1291 ).

(ఖ) -నుండి : గంగకఱుతనుండి (SII 4.1190.2,. 1143), మొ. వి. దీన్ని ఆంగ్లంలో from అనే అర్ధంలో వాడుతారు. ఈ అర్థంలో నేడుపయోగంలో ఉన్న -నుంచి రూపం ఈ యుగంలో కనిపించదు.

(గ) -కంటెన్‌ : ఈ ప్రత్యయ౦ చాలా క్వాచిత్కంగా కనిపిస్తుంది.