శాసన భాషా పరిణామం 125
నహార్థంలో : సుఖంబున (SII 4.737.4, 1115), వినోదంబులు (పై. 10.334.56, 1251 ). ఇట్టి రూపాలు సారస్వతంలోనే నిల్చాయి. కాని వాడుకకు రాలేదు.
కరణార్థంలో : కొలందుడిచెను ( SII 6,628 49, 1224 ), నల్లిఱాతకట్టి ( పై. 6.1142.15, 1268 ). ఈ ప్రత్యయాల పైన-చేసి హేత్వర్థంలో చేరుతుంది. భక్తింజేసి (పై. 4.1073,4, 1149), గ్రోప్పించుటంజేసి (పై. 6.1177.8.1201), ధర్మువునం జేసి (పై. 4 661.73, 1297) మొ వి.
(ఖ) -తోడన్ :-తోన్ : ఇవి సహార్థంలో వస్తాయి, భక్తితోడ (SII 5.163.6,1156), దయతోనిచ్చె (1089.89.19,1132).తోడన్ అనే రూపానికి తోఱన్ అనేది ప్రాచీనరూపం, ఱ > డ మార్పురాక పూర్వమే అకారం లోపించడం మూలంగా -తోన్ రూపం ఏర్పడి ఉండాలి.
(గ) మెయిన్ : ఇదీ సహార్ధంలోనే వస్తుంది. సచ్చరితమెయిని (SII 10.111.14, 1142) మొ. వి. ఈ ప్రత్యయం ఉన్న రూపాలన్నీ పద్యశాసనాల్లోనే ఉన్నాయి. ఇది 14 వ శతాబ్దిలో బొత్తుగా కనిపించదు.
4.43 చతుర్ధీ విభక్తి : -కిన్, -నకున్, -కున్ : ఇకరాంతాల తర్వాత -కిన్ -ఉకారాంతాల తర్వాత ,-నకున్ వస్తాయి. ఈ ప్రత్యయాలు సాధారణంగా సంప్రదానార్థంలో, నిమిత్తార్థంలో వస్తాయి.
సంప్రదానార్థంలో : కోలకానికి (SII 10.91.82, 1132), రిషి పెద్దికి (పై. 6.207.12, 1209) మొ. వి.
నిమిత్తార్ధంలో : చమరునకు (పై 10.427.21, 127౦), అరదివియకు (పై. 6.679, 1183)మొ. వి. ఈ ప్రత్యయం ముందు మువర్ణకం పాక్షికంగా లోపిస్తుంది. లోపిస్తే పూర్వస్వరం దీర్ఘమవుంది. దీపానకుం ( SII 6.84,4,1292) మొ. వి. అలా మువర్ణకం లోపించిన తర్వాత -నకు ప్రత్యయానికి బదులు -నికి ప్రత్యయం క్వాచ్చిత్కంగా కనిపిస్తుంది. దీపానికి (SII 10.293.3, 1241) మొ. వి.