Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 తెలుగు భాషా చరిత్ర

(పై. 6.645.3, 1158) మొ. వి. తిప్రత్యయం ముందు. ద్విత్వం ఉండదు. తక్కినచోట్ల ఱ్ + తి > టి : పడమర - పడుమటం (పై. 5.167.14 1200) మొ వి

(ఘ) డకారం -తితో కనిసి -టి అవుతుంది, వీడు-వీట (SII 10. 690.9, 1139 ) మొ. వి.

(5) పై ప్రత్యయాలు చేరనిపదాలు క్వాచిత్క్మంగా కనిపిస్తాయి. పడుమఱ భాగము ( SII 5.1133.4, 1155 ), చేబ్రోలు నాండం (పై. 5.1250.1122), వాకిలికి (పై. 4.952.2, 1313) మొ.వి.

(6) పై ప్రత్యయాలు చేరిన పదాలనుండి అనుచిత విభాగమై -oటి, -టి ప్రత్యయాలు చేరడం ఈ యుగంలో చాలా తరచుగా కనిపిస్తుంది. రాత్రింటి ( SII 6 1118.35,1281), నగమింటిలోను (పై.6.1008.12, 1389), రాత్రి అనే సంస్కృత పదంలోనూ ఇది రావడం గమనార్హం.

4.41. ద్వితియావిభక్తి : -ను ద్వితీయా విభక్తి ప్రత్యయం. ఫలమును బొందుదురు (NI. 2,18.9, 1155). దీనికి అనుస్వారం కూడా అవుతుంది. కవిలం వధించి (పై. 1 24.14, 1187) మువర్ణకం గల వాటిపై, క్వాచిత్కంగా -ము లోపించి -న్ని చేరుతుంది. దీనిముందు (హస్వం ధీర్ఘమవుతుది. ధర్మాన్ని (NI 1.40.8, 1140).

ఈ ద్వితీయావిభక్తి ప్రత్యయం కర్మార్థంలో వస్తుంది. సాధారణాంగా క్లీబ రూపాలకు ప్రథమరూపాల్నే ద్వితీయలోనూ వాడుతారు. ఈ ధర్మువు ప్రతిపాలింపనివారు (తె. శా. 1.5. 29, 1221).

4.42. తృతీయావిభక్తి : (క) -న్‌, -అన్‌, -నన్‌ : (ఖ) _తోడన్ -తోన్, (గ) మెయిన్‌,

(క) -న్‌, -అన్‌, -నన్‌ : ఉకారంత పదాలవై -నన్‌, ఇకారంత ఔపవిభక్తికాలపై -అన్‌ మిగిలినిచోట్ల -న్‌ వస్తాయి. ఇవి సాధారణ౦గా సహార్థంలోనూ వస్తాయి.