శాసన భాషా పరిణామం 123
(పై. 10.173.7, 1170), వాద్యకొఱకు (పై .10.707.14.1153), పెక్కoడ్రును (పై. 6.98.2, 1131), వాస్యకాంఱృకు (పై. 6. 1116.15, 1376), మొ. వి.
(3) -ను, -లు, -రు చివరగల కొన్ని నామపదాలకు -ఇ చేరుతుంది. చేనికి (SII 10.488.34, 1198), పాలిలోన (పై. 10.425,11,1270), పోరిలోన (పై. 6,117.47, 1118). నీరు శబ్దం మాత్రం -ఇ ప్రత్యయాన్ని పాక్షికంగా తీసుకొంటుంది. మున్నీరులోం (పై.4.1075.8, 1166), నీరువేల (పై 4. 704,15 1167). 14వ శతాబ్దిలో -ఇ ప్రత్యయం. లేని రూపాలే ఉంటాయి. నీరు శబ్దానికి -టి ప్రత్యయం కూడా క్వాచిత్కంగా కనిపిస్తుంది. నీటినేల ( NI 1.39.5, 1141) మొ. వి. చేను శబ్దానికి కూడా ఒకచోట -ఇ ప్రత్యయం లేకుండా కనివిస్తుంది (SII 7.735.11, 1291).
(4) య, ల, ఱ, డ-లు చివరగల కొన్ని పదాలకు -తి చేరుతుంది. ఇది చేరేటప్పుడు కింది విధంగా సంధిమార్పులు వస్తాయి.
(క) -తి చేరేటప్పుడు యకారం లోపిస్తుంది. నేయి-నేతికి (SII 5.1107.11 1139).
(ఖ) లకారాంత పదాలకు తి చేరినప్పుడు రెండు రకాలైన సంధికార్యాలౌతాయి. (1) ల్ + తి > ణ్టి, (2) ల్ +-తి > టి. ఇందు మొదటిది హ1 అ1 (హ2) హ2 అ2 రూపాలపైనను (హ2 లకారం అ2 అకారం తప్ప తక్కిన అచ్చు), రెండోది తక్కిన రూపాలపైననూ అవుతాయి. ఇల్లు - ఇంటను (SII 10.507.17,1314), కుఱుంగల్లు - కుఱుంగంటికి (పై. 10.112.8 1248). ఇక్కడ కల్లు శబ్దం సమాసగతంగా ఉంది(చూ. 2.89 (చ)). తక్కినచోట్ల కేవలం-టి మాత్రం వాకీలి-వాకిటాన (NI 3.78 87, 1353) మొ.వి.
(గ) హ1 అ హ2అ (రూపాంతరం హ1 అహ2హ2 అ) రూపంలో ఉన్న శకటరేఫకు -తి ప్రత్యయం ముందు మార్పేమీ ఉండదు. మ్రోంపఱ్డు-మ్రోంపఱుతను ( SII 10,172.10, 1170), కఱు-కఱ్త