పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

122

తెలుగు భాషా చరిత్ర

దీనిముందు ను అనుస్వార మవుతుంది. మ్రా౦కులు (SII 4.1050.9,1165) మొ.వి.

(ఞ) రాత్రి శబ్డానికి -ళ్ళు కూడా బహువచన ప్రత్యయంగా వస్తుంది. రాత్రుళ్ళు (NI 1.23.28,1847) మొ. వి.

(ట) పూజ్యార్థంలో బహువచన ప్రత్యయం చేరడం ఈయుగంలో చాలా తరచుగా కనిపిస్తుంది. పై చెప్పిన వాటిలో -రు,-లు. గౌరవార్థం చేరినవి, గురులు (SII 4.778,6,1165 ), గుండమదేవులు (పై. 4.680.10,1171) మొ.వి. బ్రహ్మరాయరు. (పై.5.1083.6, 1108), దేవరు (పై.10.689.2, 1137). మొ.వి. పూజ్యార్దంలో-గారు ద్వితీయారూపానికి చేరుస్తారు. నంబిగారు (NI 2.51.7,1198), భాను ఏడ్రాయనిగారు (SII 6,377.12, 1340) మొ.వి. పూజ్యార్థంలో -వారు: జియ్యరువారు. ( NI 2. 51.7. 1155). జక్కిరడ్డివారు (SII 6.93.1, 1241).

విభక్తిప్రత్యయాలు :

4.40. ప్రథమా విభక్తికి ప్రత్యకంగా ప్రత్యయాలు లేవు. పైన చెప్పిన రూపాలు అలాగే ప్రథమారూపాలుగా వాడవచ్చు, ద్వితీయాది విభక్తి ప్రత్యయాల్ని పైన చెప్పినకొన్ని నామపదాలకు అలాగే చేర్చవచ్చు. ఉదా: పొలములోన (SII 5.1016.13, 1134). కాని కొన్నింటికి పదాంతంలో కొంతమార్పు పొంది ప్రత్యయాలు చేరుతాయి. అట్టి మార్చును తేచ్చే ప్రత్యయాల్ని ఔపవిభక్తిక ప్రత్యయాలంటారు. అవి ఈ కింది విధంగా వస్తాయి.

(1) మహత్ప్రత్యయంగల పదాల్లో _డుజ్జు లోవిస్తుంది. అలా లోపించిన దానిమీద -ని పాక్షికంగా రావచ్చు. పరమాత్మునిచేం (SII 4.737.32, 1115), రఘునాధునిచేం (పై. 10.89.13, 1132) మొ. వి. డుజ్జులోపించక -ఇ చేరిన రూపాలుకూడా ఈయుగంలో కనివిస్తాయి. దేవుడికి (NI 3.138.9, 1247), వాన్రి పెద్దకొడుకు (NI 3.9.29, 1259 మొ.వి.

(2) బహువచన ప్రత్యయాలైన -లు, -రు, -ఱు, -ండ్రు పైన ఆ చేరుతుంది. నివేద్యములకు (SII 5.90.11, 1177), మునూర్వురకు