పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

120

తెలుగు భాషా చరిత్ర

   పై వానిలో ౦ఱు -౦(ఱు విశాఖప్రాంతంలోనే కనిపిస్తాయి. పైనాలుగు రూపాల్నిబట్టి పునర్నిర్మాణం (reconstruct) చేస్తే* న్ఱు వీటికి ప్రాచీనరూపమని చెప్పవచ్చు (చూ. 6,12). -కా- ప్రత్యయంలో దీర్ఘం ఊంది. కాబట్టి ఈ దీర్ఘం పైన అనునాసికంపోయి -ఱు ఒక మాండలికంలో అయి ఉంటుంది. బహుశా ఇది కన్నడప్రాంత మాండలికంలో అయి ఉండవచ్చు. -న్ఱు > -౦డ్రుగా ఇంకో మాండలికంలో అయి ఉంటుంది. తర్వాత మాండలికమిశ్రం (dialect-mixing) వల్ల -౦డ్రు, -ఱు రెండు రూపాలూ తెలుగుభాషలో నిల్చాయి. నన్నయ, నన్నెచోడుల భాషల్లోనూ, 12 వ శతాబ్దిదాకా శాసనాల్లోనూ ఒక్క కాఱు శబ్ధమే కనిపిస్తుంది, -కా౦డ్రు శబ్దం 18 వ శతాబ్టిసుండే కనిపిస్తుంది. ఈ- కాండ్రు ప్రత్యయం 13వ శతాబ్దినుండి ఎక్కువౌతూ 14వ శతాబ్దిలో దాదావు-కాఱు రచనలో లోపిస్తుంది.
   పెక్కండ్రు (SII 4.974.2, 1132 ), ఎన్మండ్రు (పై. 5.1305. 11,1107) తొమ్మండ్రు (పై. 6.87.11,1164), పదుండ్రు (ఫై. 10 130.15, 1153) ఇర్వoడ్రు ( 6.1189.64, 1260 ) మొ. శబ్దాలోను-ండ్రు ప్రత్యయం కనిపిస్తుంది. వీటీలో ఎన్మండ్రు అనడానికి రూపాంతరం ఎనమంఱు (SII 6. 1052.10, 1350) కూడా వికాఖ ప్రాంతంలో కనిపిస్తుంది.
   4.39. -లు : సర్వసాధారణంగా బహువచన ప్రత్యయంగా వచ్చేది -లు. ఇది కొన్ని ప్రాతిపదికలకు మార్పేమీ లేకే చేరుతుంది. తలియలు (SII 6.1294.9, 1245) మొ. వి. కాని ఈ ప్రత్యయం ముందు కొన్ని రకాలైన ప్రాతిపదికలకు మార్పులు వస్తాయి. అవి ఈ కింది విధంగా జరుగుతాయి. 
   
    (క) -లు ప్రత్యయం ముందు మహత్ప్రత్యయం లోపిస్తుంది. తమ్ములు ( SII.6.192.7, 1167). 
    
    (ఖ) -ము వర్ణకాంతాలకు-లు అలాగే చేరవచ్చు. కుంచములు (పై. 6.1328.9, 1115), లేదా ము వర్ణకం లోపించి పూర్వాచ్చు దీర్ఘం కావచ్చు. కారణాలు (పై. 4.1115.15, 1165).
   (గ) -లు ప్రత్యయం ముందు-ఇకారం ఉకారమౌతుంది (మాని) మానులు (పై. 4.992.6.1156). [వ్రిత్రి] వ్రిత్తుల (పై. 4.667.3,1112)