Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

118

తెలుగు భాషా చరిత్ర

   4.35. మహతి (ఏకవచనము) : -ఱాలు, -ఆలు, -త్య : నాయకుఱాలు. (SII 5.1030.5, 1141 ), బాలవ్యాకరణంలో - రాలు అని ఉంది. కాని శాసనాలలో బహుసంఖ్యాకంగా - ఱాలు అనే ఉన్నది. -ఆలు ప్రత్యయం కొన్ని బంధుత్వపదాల్లోనే ఉంది. కోడలు (SII 6.634.2, 1153), మఱoదలు(పై. 6.634.2., 1153); వ్రిత్తికత్త్య (పై. 10.110.13, 1141)మొ.వి. -త్త్య -కా ప్రత్యయం మీదనే వస్తుంది. దీనిముందు కాలోని ధీర్ఘత పోతుంది.
   4.36. క్లీబం : -ము, -మ్ము, -౦బు, -౦ (అనుస్వారం): కూటము (SII 4.1102.11, 1150), సుంకమ్ము (NI 1.25.59, 1284), దేశంబు (SII 6.402. 20, 1264). రక్తం  (NI 1.24. 14, 1187) మొ.వి.

బహుధాతుకం (సమాసం)

   4.37. సమాసాలు నాలుగు రకాలు 1. దేశి, 2. తత్సమం. 3. మిశ్రం. 4. వర్ణలుప్తం.
   (1) దేశి : దేశిరూపాలతో అయ్యేది దేశసమాసం. దేశిసమాసాలు ఏర్పడే విధాన్ని బట్టి ఈ కింది విభజన చేయవచ్చు.
   (క) ఇతరత్ర స్వతంత్రప్రయోగం ఉన్నరూపం విశేణంగా ఉన్నాకూడా దానిని విడదీస్తే అర్ధము మారిపోయింది. కాబట్టి అట్టివి సమాసంగానే భావించాలి. ఛలివందిలి (తె. శా. 1.37.3, 1215), గుండకుడ్క (SII 5.1172.15, 1293 ) మొ. వి.
   (ఖ) మరోచోట స్వతంత్రప్రయోగం లేని బంధరూపం (boundform) విశేణంగా ఉండటం. నల్లిల్లు (తె.శా. 1. 17. 27,1115). “నల్‌"కు స్వతంత్రప్రయోగం లేదు: ఆంబోతు(SII 10. 834.102,1251), “ఆన్‌" కు స్వతంత్రప్రయోగంలేదు మొ.వి.
   (గ) బంధరూపంపై- అ చేరినవి. మేనమామ (SII 6.634.1,1153), అనపాలు (పై. 6.1118.18, 1281) (ఆవుపాలు ). ఊరతలారి (పై 10.528.11 1819).
   (ఘ) పై-అ ముందు ము వర్ణకమందలి మకారానికి ప వర్ణమౌతుంది.