Jump to content

పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

117

1158), సుంకఱి (పై. 6,617.7, 1145), తలాఱ (NI 2.8.6,
1188), తలాఱి (NI 2.10.7, 1188) మొ. వి.

తలాఱి మొదలగు శబ్దాల్లో సాధురేఫ శకటరేఫ గూడా కనిపిస్తున్నాయి. అంటే సాధురేఫకూ, శకటరేఫకు గల వ్యత్యాసం ఈ పదాల్లో తబ్బిబైందన్నమాట. కొట్టరి, పురవరి మొదలైన మాటలలోని -ఆరి, -అరి ప్రత్యయాలు బహువచనానికి సంబంధించినవని చెప్పవచ్చు. కాని ఏదో కారణంచేత ఇవి శకటరేఫలతో కూడా శాసనాలలో కనివిస్తాయి.

   (క) లోని-కాణ్డు రూపానికి కన్నడంలో-కాఱ్డ అనేరూపం ఉంది, బహుశా ఈ కన్నడంలోని-కాఱ శబ్దం ప్రభావం వల్ల పై రూపాల్లో శకటరేఫ వచ్చి ఉండవచ్చు.
   (గ) -ఇ : ఉదారి (SII 4.666.8, 1189), భండారి (పై. 6.154.7,1152): ఈ-ఇ ప్రత్యయమే పై తలారి మొ. వానిలోని -ఇ అయిఉంటుంది. (చూ. 4 33 (ఖ) ).
   (ఘ)-క- : దీని తర్వాత క్లీబవాచక ప్రత్యయమైన -ము/-౦ (బిందువు) చేరుతుంది. రడ్డికము ( SII 4.737,15, 1115), రడ్డికం (పై. 4.762.18, 1131) మొ. వి.
   (చ) -తన-: దీని తర్వాత కూడా -ము/-o వస్తుంది. స్టానాపతి తనము (పై- 10.709.9,1189), తలారి తనము (పై .6.207.31,1209) మొ. వి.

లింగబోధక ప్రత్యయాలు (Gender Suffixes) :

   4.34. మహత్తు (ఏకవచనం) : -ంఱు, -ణ్డు, -డు. వీటిలో ౦ఱు ప్రాచీనరూపమైన -న్డుకు రూపాంతరం అనవచ్చు. వ్రిత్తికాంఱు (NI 1.24.17, 1187), అల్లుణు (పై 6.628,9. 1202), తమ్ముడు (పై. 6.120.39, 1275) - oఱు ప్రత్యయం. నెల్లూరశాసనంలో ఒకచోట మాత్రం కనిపిస్తుంది. ఇది ఆ ప్రాంతంలో కనీసం మాండలికంగానైనా వ్యవహారంలో ఉండేది అనడానిని వాన్రి పెద్దకొడుతు ( NI 3.9.29 ) అనే ప్రయోగం ప్రబలమైన ఆధారం.